తండ్రి పేరును నిలబెట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకులు?  

comedian dharmavarapu subramanyam family details, dharmavarapu subramanyam, Comedian, Rohith Sandeep, Ravi Bramha Teja, Nuuvu Nenu, Varsham, Style, Jandhyala - Telugu Comedian, Dharmavarapu Subramanyam, Jandhyala, Nuuvu Nenu, Ravi Bramha Teja, Rohith Sandeep, Style, Varsham

టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పేరు తప్పక ఉంటుంది.ఇతర కమెడియన్లతో పోలిస్తే ధర్మవరపు కామెడీ టైమింగ్ భిన్నంగా ఉంటుంది.

 Comedian Dharmavarapu Suramanyam Family Details

ధర్మవరపు కేవలం హావభావాలతోనే కామెడీని పండించగలరు.సాధారణంగా ఎవరైనా వెండితెరపై అవకాశాలు తగ్గితే బుల్లితెరపై అదృష్టాన్ని పరిశీలించుకుంటారు.

అయితే ధర్మవరపు మాత్రం మొదట బుల్లితెరలో పని చేసి ఆ తరువాత వెండితెరలో అవకాశాలు సంపాదించారు.

తండ్రి పేరును నిలబెట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లా కొర్రిపాలెం గ్రామానికి చెందినవారు.

కమ్యూనిస్ట్ భావజాలం గల ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది.ఇంట్లో చెబితే సినిమాల్లో నటించడానికి ఒప్పుకోరని భావించిన ధర్మవరపు సినిమాల్లో అవకాశాల కొరకు ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ కు వెళ్లాడు.

అయితే ధర్మవరపు ఎంత ప్రయత్నించినా ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాలేదు.

అయితే సినిమాలపై ఆసక్తి ఉన్నా చిన్నప్పటి నుంచి చదువుపై కూడా ధర్మవరకు సుబ్రహ్మణ్యంకు బాగానే ఆసక్తి ఉండేది.

సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇంటికి తిరిగొచ్చేసిన ధర్మవరపు తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం సంపాదించి హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు.టీవీలో ఆనందో బ్రహ్మ నాటకంతో కెరీర్ మొదలుపెట్టిన ధర్మవరపు జంధ్యాల దృష్టిలో పడటంతో జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో అవకాశం వచ్చింది.

నువ్వు నేను, వర్షం, స్టైల్, సింహాద్రి, ఒక్కడు లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ధర్మవరపు వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు.

భార్య పేరు కృష్ణజ కాగా పిల్లల పేర్లు రోహిత్ సందీప్, రవి బ్రహ్మతేజ.వీళ్లకు సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.వ్యాపారవేత్తలుగా గొప్ప స్థాయికి ఎదిగి తండ్రి పేరును నిలబెడుతున్నారు. ధర్మవరపు 2013 సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడి చనిపోయారు.

#Jandhyala #Nuuvu Nenu #Rohith Sandeep #Style #Varsham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Comedian Dharmavarapu Suramanyam Family Details Related Telugu News,Photos/Pics,Images..