పవన్ సినిమా అంటే పాత్ర గురించి ఆలోచించనంటున్న ధన్ రాజ్... ఎందుకో

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.మామూలుగా హీరోలకి ఫాన్స్ ఉంటారు గానీ కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారని సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

 Comedian Dhanraj Sensational Comments On Pawan Kalyan, Comedian Dhanraj Comments-TeluguStop.com

అంతేగాక పవన్ కళ్యాణ్ కి పలువురు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ గా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే ఈ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరైన టువంటి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తనకు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చాడు.

అంతేకాక ఇప్పటి వరకూ తాను పవన్ కళ్యాణ్ నటించినటువంటి నాలుగు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు చేశానని తెలిపాడు.అంతేగాక పవన్ కళ్యాణ్ చిత్రం అంటే తన పాత్రకి ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఆలోచించని డైరెక్ట్ గా ఓకే చెబుతానను కూడా తెలిపాడు.

అంతేగాక మెగాస్టార్ చిరంజీవి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చానని తెలిపాడు.అంతేగాక ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకి తాను అందుబాటులో లేకపోవడంతో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయలేకపోయాననీ చెప్పుకొచ్చాడు.

Telugu Dhanraj, Dhanrajpawan-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి ధనాధన్ ధన్ రాజ్ ప్రస్తుతం పలు రకాల షోలు ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.అంతేగాక జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి అదిరింది అనే షోలో కమెడియన్ గా నటిస్తున్నాడు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube