మహేష్ బాబు తో హాలీవుడ్ లో సినిమా తీస్తానంటున్న తెలుగు కమెడియన్....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో కొత్త గా ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో అలీ ప్రతి ఎపిసోడ్ కి ఎవరో ఒక సినీ సెలెబ్రెటీని గెస్ట్ గా పిలిచి సందడి చేస్తుంటాడు. దాంతో తాజాగా ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కమెడియన్ చలాకి చంటి విచ్చేసి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Comedian Chalaki Chanti Want To Make Film With Mahesh Babu In Hollywood, Chalaki-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా తాను ఎప్పటికైనా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ని ఒప్పించి హాలీవుడ్లో సినిమా తీస్తానని తన మనసులో మాటను బయటకు పెట్టాడు.అంతేకాక ఇప్పటికే తన హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేశానని కేవలం మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని కూడా చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత పలు తన కుటుంబ విషయాలను గురించి మాట్లాడుతూ కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.అయితే చలాకి చంటి ఎందుకు బాధ పడ్డాడని విషయం గురించి  మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం ప్రసారమయ్యే  ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చలాకి చంటి జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ మరియు  కామెడి స్కిట్  స్క్రిప్ట్ రైటర్’గా పని చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.అంతేగాక పలు టాలీవుడ్ చిత్రాల్లో కూడా కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube