ఆ మాట చెబితే ఎవరూ నాకు వేషం ఇవ్వరు.. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!

Comedian Brahmanandam Interesting Comments About Movie Offers

తెలుగులో వందల సంఖ్యలో సినిమాల్లో  నటించి కమెడియన్ గా బ్రహ్మానందం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఇప్పటివరకు 1200కు పైగా సినిమాలలో నటించిన బ్రహ్మానందం చాలా సందర్భాల్లో జంధ్యాల తన గురువు అని చెబుతారు.

 Comedian Brahmanandam Interesting Comments About Movie Offers-TeluguStop.com

బ్రహ్మానందం కామెడీ వల్లే హిట్టైన సినిమాలు కూడా తెలుగులో చాలనే ఉన్నాయని చెప్పాలి.దర్శకుడు శ్రీను వైట్ల సినిమాల్లోని పాత్రలు బ్రహ్మానందంకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అలీతో సరదాగా షోలో బ్రహ్మానందం మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా ప్రభావం ఉందని సినిమాలు ఎందుకులే అని తాను అయినా అనుకుని ఉండవచ్చని లేదా మేకర్స్ అయినా అనుకుని ఉండవచ్చని బ్రహ్మానందం తెలిపారు.ప్రస్తుతం ఐదారు సినిమాలతో తాను బిజీగా ఉన్నానని భీమ్లా నాయక్, రంగ మార్తాండ, నితిన్ మూవీ, శర్వానంద్ మూవీలో నటిస్తున్నానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.ఇంతవరకూ ఎన్నో కష్టాలు పడుతూ వచ్చానని బ్రహ్మానందం తెలిపారు.

 Comedian Brahmanandam Interesting Comments About Movie Offers-ఆ మాట చెబితే ఎవరూ నాకు వేషం ఇవ్వరు.. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకనైనా తాను కొంచెం సుఖపడాలని అనుకుంటున్నానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.పని దొరికిన సమయంలో ఆ పనిని గౌరవించి జాగ్రత్తగా చేసుకోవాలని నా వయస్సు వచ్చేవరకు కష్టపడాలని అలీకి చెబుతానని అలీ వింటాడని తనకు నమ్మకం ఉందని బ్రహ్మానందం అన్నారు.తాను సినిమాలు తీయడం లేదని డైరెక్షన్ చేయడం లేదని క్యారెక్టర్లు క్రియేట్ చేయడం లేదని ఒకే తరహా పాత్రలు చేస్తున్నారనే విమర్శలకు బ్రహ్మానందం చెక్ పెట్టారు.

Telugu Alito Saradaga, Brahmanandam, Interestng, Offers-Movie

ఇంతకుముందే నేను ఇలాంటి పాత్రను చేశానని నేను ఈ పాత్ర చేయనని చెబితే తనకు ఎవ్వరూ వేషం ఇవ్వరని ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదని బ్రహ్మానందం తెలిపారు.ఆర్టిస్టుకు ఉండాల్సిన లక్షణం అవతలి వాళ్లకు ఏం కావాలో అది ఇవ్వడమేనని బ్రహ్మానందం తెలిపారు.బ్రహ్మానందం తన మాటల ద్వారా కేరీర్ విషయంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో చెప్పకనే చెప్పేశారు.

#Alito Saradaga #Offers #Interestng #Brahmanandam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube