ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన జబర్దస్త్ అవినాష్..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో పదుల సంఖ్యలో స్కిట్లు చేసి కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు అవినాష్.అయితే లాక్ డౌన్ సమయంలో కొన్ని వారాల పాటు జబర్దస్త్ షో కూడా ఆగిపోవడంతో అవినాష్ ను ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముట్టాయి.

 Comedian Avinash  Got Huge Name And Fame With  Star Maa Shows,latest Tollywood N-TeluguStop.com

అదే సమయంలో బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో జబర్దస్త్ నిర్వాహకులకు 10 లక్షల రూపాయలు కట్టి అగ్రిమెంట్ బ్రేక్ చేసి అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.

వాస్తవానికి గతంలో కూడా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లు సినిమాల కోసం, ఇతర కారణాల వల్ల ఆ షోకు దూరమయ్యారు.

అయితే ఆ షోను వీడిన కమెడియన్లలో ఎవరూ సక్సెస్ సాధించలేదు.కానీ అవినాష్ మాత్రం జబర్దస్త్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ ఉండటం గమనార్హం.ఇప్పటికీ అవినాష్ ను అతని అభిమానులలో చాలామంది జబర్దస్త్ అవినాష్ అనే పేరుతోనే పిలుస్తారు.అవినాష్ స్టార్ మా ఛానెల్ లో చేస్తున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కూడా హిట్టైన సంగతి తెలిసిందే.

Telugu Big Boss Show, Comdian Avinash, Stars Program, Jabardasth Show-Movie

స్టార్ మా నిర్వాహకులు అవినాష్ తో చేసిన ఈవెంట్లు, పాల్గొంటున్న గేమ్ షోలు సైతం మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.బిగ్ బాస్ హౌస్ లో అరియానాతో సన్నిహితంగా మెలిగిన అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈవెంట్లలో అరియానాతో ఎక్కువగా కనిపిస్తున్నారు.బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ పరిస్థితి ఏమిటంటూ ఎదురైన ప్రశ్నలకు తన సక్సెస్ తో అవినాష్ సమాధానం చెబుతున్నారు.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్స్ ప్లస్ షోలోను అవినాష్ పాల్గొని సందడి చేస్తున్నారు.

స్టార్ మా ఛానెల్ తో ఉన్న అగ్రిమెంట్ వల్ల అవినాష్ ఆ ఛానెల్ ప్రోగ్రామ్స్ లో మాత్రమే పాల్గొనాలి.స్టార్ మా ఛానెల్ లోని ప్రోగ్రామ్స్ ద్వారా అవినాష్ జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube