ఘనంగా వైవా హర్ష పెళ్లి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్?

Comedian And Youtuber Viva Harsha Got Marraied Akshara

యూట్యూబర్‌ గా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైవా హర్ష పెళ్లి నిన్న హైదరాబాదులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.గత కొద్ది రోజులుగా హర్ష అక్షర అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

 Comedian And Youtuber Viva Harsha Got Marraied Akshara-TeluguStop.com

ఈ క్రమంలోనే గత ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇలా నిశ్చితార్థాన్ని జరుపుకున్న హర్ష నిన్న అక్షర మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.

ఇలా హర్ష వివాహానికి దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కె ఎన్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఇతర కమెడియన్లు పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ క్రమంలోనే వీరితో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో హర్ష పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 Comedian And Youtuber Viva Harsha Got Marraied Akshara-ఘనంగా వైవా హర్ష పెళ్లి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు హర్ష దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

యూట్యూబర్‌గా తన కెరీర్‌ ప్రారంభించి ‘వైవా’ అనే కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే హర్ష పేరు వైవా హర్షగా మారిపోయింది.ఇలా ఎలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాలో నటించగా తాజాగా కలర్ ఫోటో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు.

ప్రస్తుతం వైవా హర్ష పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Viva Harsha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube