స్టార్ కమెడియన్ అలీ ఇల్లు చూశారా.. ఇంద్ర భవనాన్ని తలపించేలా?

బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కెరీర్ ను కొనసాగించారు.ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన ఈటీవీలో అలీతో సరదాగా షోకు యాంకర్ గా అలీ వ్యవహరిస్తున్నారు.

 Comedian Ali Wife Zubeda Shares Home Tour Promo In Social Media, Social Media ,-TeluguStop.com

అలీ భార్య జుబేదా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే సంగతి తెలిసిందే.అయితే జుబేదా యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను పోస్ట్ చేశారు.

జుబేదా అలీ పేరుతో ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ లో జుబేదా హోమ్ టూర్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.వీడియోలో అలీ తన అక్క ఫోటోను చూపిస్తూ అక్క చిన్నప్పుడు తనను రెడీ చేసి షూటింగ్ లకు పంపించేవారని వెల్లడించారు.

అమ్మాయి కాపురం, సీతాకోక చిలుక సినిమాలకు తనకు వచ్చిన అవార్డులను అలీ ఈ వీడియోలో చూపించారు.అక్వేరియంను చూపిస్తూ ఆ ఫిషెస్ తన ఇంట్లోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయిందని అలీ అన్నారు.

జుబేదా వీడియోలో జిమ్, స్విమ్మింగ్ పూల్ తో పాటు నమాజ్ ఏరియా, డైనింగ్ ఏరియా, హాల్ ను చూపించారు.ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా త్వరలో హోమ్ టూర్ కు సంబంధించిన ఫుల్ వీడియో రిలీజ్ కానుంది.అలీ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.జుబేదా పెళ్లి ఫోటోలతో పాటు పాపకు సంబంధించిన వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు.

అలీ భార్య యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసినందుకు అలీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.హోమ్ టూర్ ఫుల్ వీడియోను త్వరగా అప్ లోడ్ చేయాలని కోరుతూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అలీ భార్య షేర్ చేసిన హోమ్ టూర్ ప్రోమోకు 58,000కు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube