మంత్రి అవ్వాలనుకుంటున్న ఆలీ.... ఏంటి ఈ కన్ఫ్యూజన్...?     2019-01-07   14:49:16  IST  Sai Mallula

ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ నాయకుడు అవ్వాలని తహతహలాడుతున్నాడు సినీ కమెడియన్ ఆలీ. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడుగా ఉన్న ఆయన వైసీపీ అధినేత జగన్ ని కలవడం పెద్ద చర్చకే దారితీసింది. ఆయన వైసీపీలో చేరిపోతున్నాడు అంటూ… గత కొద్ది రోజులుగా… హడావుడి జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో ఆయన మాత్రం ఏ క్లారిటీ మాత్రం ఇవ్వలడం లేదు.

తాజాగా ఉండవల్లి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని కలవడం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఆలీ ఏ పార్టీలో చేరుతున్నాడు అనే విషయంలో అందరికీ క్లారిటీ లేకుండా పోయింది. అయితే రాజమండ్రి నుంచి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆలీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఇంకా సస్పెన్స్.

Comedian Ali Wants To A Minister In His Political Career-Comedian Comedian Politics Janasena Pawan Kalyan Janasena Tdp Ys Jagan Ysr Cp

Comedian Ali Wants To A Minister In His Political Career

అయితే… కేవలం ఎమ్యెల్యే అవ్వడమే టార్గెట్ కాదట. ఇంకా తనకు పెద్ద కోరికే ఉన్నట్టు ఆలీ ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో తన ఆశలు అన్నీ వెళ్లబోసుకున్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సరిపోదని… మంత్రి పదవి కూడా కావాల్సిందే అంటున్నారు. అలా ఇచ్చే పార్టీలో చేరతానని..తనకు దాపరికాలు ఏమీ లేవంటున్నారు. రాజమండ్రి, గుంటూరు తూర్పు నియోజకవర్గంపై అలీ కన్ను ఉంది. ముఖ్యంగా… గుంటూరు లో ముస్లిం జనాభా ఎక్కువ. ఎప్పుడూ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. తనకు అక్కడ సీటు ఇచ్చి .. మంత్రి పదవి కూడా ఇవ్వాలంటున్నారు. ఏ పార్టీ ఇలా ఇస్తే ఆ పార్టీలో చేరిపోతాను అంటూ… అలీ రాజకీయ పార్టీలకు ఆఫర్ కూడా ప్రకటించేశాడు.

Comedian Ali Wants To A Minister In His Political Career-Comedian Comedian Politics Janasena Pawan Kalyan Janasena Tdp Ys Jagan Ysr Cp

జనవరి 9వ తేదీన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆదివారం.. అశ్వనీదత్ తో కలిసి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ నేతలు షాక్‌ కు గురయ్యారు. మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు.. ఆయన ఆశిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యేలను తొలగించి.. గుంటూరుకు ఎలాంటి సంబంధం లేని.. అలీకి జగన్ టిక్కెట్ ఇస్తారా..? అనేది పెద్ద చర్చగా మారింది.