నా సంసారంలో నిప్పులు పోయకు అంటున్న కమిడియన్ అలీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద హిట్ సినిమాలను చేసి ఎంతో మందిని తన ఫ్యాన్స్ గా చేసుకున్న డైరెక్టర్ వి.వి.

 Director Vv Vinayak With Comedian Ali In Alitho Saradagaa Show, Tollywood Indust-TeluguStop.com

వినాయక్. తెలుగు ప్రజల మాస్ ప్లస్ తెలుసుకున్న ఈ డైరెక్టర్ మాస్ ట్రెండును కొనసాగిస్తూ అనేక సినిమాలను తెరకెక్కించాడు.అలాగే కమెడియన్ అలీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.30 సంవత్సరాలకు పైగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా పేరు పొందాడు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో వి.వి.వినాయక్ కు అలీకి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వివి వినాయక్ ఆది సినిమా ఫస్ట్ క్లాప్ నుండి ఖైదీ నెంబర్ 150 వరకు ఫస్ట్ క్లాప్ అలీ మీదే కొట్టారట.

 Director VV Vinayak With Comedian Ali In Alitho Saradagaa Show, Tollywood Indust-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అలీ ఈ టీవీ లో నిర్వహిస్తున్న ” ఆలీతో సరదాగా “ అనే కార్యక్రమంలో ఇద్దరు వారి విషయాల గురించి చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది.మామూలుగా ఈ కార్యక్రమంలో గెస్ట్ గా వచ్చిన వారి సీక్రెట్ లను బయటకు తీసుకుంటాడు అలీ.గెస్ట్ లు షోకి రాకముందే వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకొని షో మొదలైన తర్వాత వారికి షాకింగ్ న్యూస్ చెపుతూ ఉంటాడు.అయితే ఇదంతా ఒక ఎత్తు తాజాగా జరిగిన ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో మొత్తం రివర్స్ జరిగింది.

అలీకి సంబంధించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ బయట పెడతానని వివి వినాయక్ అలీని బెదిరించాడు.అందులో కొన్ని నీకు కూడా తెలియని రహస్యాలను చెప్పేస్తా అంటూ అలీ భయపెట్టాడు.

దీంతో ఆ షో మరింత వేడెక్కింది.దీంతో హడలిపోయిన అలీ ఆ విషయాలు మంచివేగా లేకపోతే నా సంసారంలో నిప్పులు పోయకు అంటూనే.

అసలే ఈ ఎపిసోడ్స్ అన్ని మా ఆవిడ చూస్తుంది అంటూ వివి వినాయక్ తో అన్నాడు.ఇకపోతే ఆ సీక్రెట్స్ ఏంటో ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే రోజు వరకు ఆగాల్సిందే.

చూద్దాం మరి అ షోలో వి.వి.వినాయక్ అలీ గురించి ఏ సీక్రెట్స్ చెప్పాడో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube