పోలీసులకు ఫిర్యాదు చేసిన అలీ

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు ఏ స్థాయిలో యాక్టివ్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే కొందరు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో లేనిది చూసి సైబర్‌ నేరగాళ్లు, ఆకతాయిలు వారిపై అకౌంట్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

 Comedian Ali Approach The Cyber Crime Police About Fake Twitter Account, Ali, Tw-TeluguStop.com

ఆమద్య రావు రమేష్‌ మీడియా ముందుకు వచ్చి మరీ తనకు ట్విట్టర్‌ అకౌంట్‌ లేదు అంటూ పేర్కొన్నాడు.తన పేరుతో ట్విట్టర్‌లో నమోదు అవుతున్న పోస్ట్‌లు అన్ని కూడా ఫేక్‌ అంటూ ఆయన పేర్కొన్నాడు.

తాజాగా అలీ వంతు వచ్చింది.తన పేరుపై ట్విట్టర్‌ అకౌంట్‌ను గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తి రన్‌ చేస్తున్నాడు.అలీ అఫిషియల్‌ అంటూ అతడు రన్‌ చేస్తున్న ట్విట్టర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని, ఆ ట్విట్టర్‌ అకౌంట్‌కు తనకు ఏ సంబంధం లేదు అంటూ అలీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడం జరిగింది.తన పేరును పాడు చేసేందుకు కొందరు ఇలాంటి అకౌంట్స్‌ ఉపయోగించుకునే అవకాశం ఉందని వెంటనే నా పేరుతో ఉన్న అకౌంట్స్‌ అన్ని కూడా తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు.

Telugu Cyber, Rao Ramesh, Tollywood-Movie

అలీ పేరుతో ఉన్న ఆ అకౌంట్‌లో సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ అప్పుడప్పుడు రాజకీయ విషయాలను కూడా షేర్‌ చేస్తున్నారు.చాలా రోజులుగా ఉంటున్న ఆ అకౌంట్‌ వల్ల తనకు మంచిది కాదనే ఉద్దేశ్యంతో అలీ ఆ అకౌంట్‌ను డిలీట్‌ చేయించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చే వరకు వెళ్లాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube