కరోనాపై పోరాటంలో ముందుకి రండి! అలీ సలహా  

Comedian Ali Suggest To People Donate For Corona Fight - Telugu, Corona Virus, Covid-19, Tollywood

కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతున్న మృతుల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉంది.ఈ నేపధ్యంలో ముందుగానే అప్రమత్తమైన భారత్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉండగానే 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 Comedian Ali Suggest To People Donate For Corona Fight - Telugu Virus Covid-19 Tollywood

ప్రజలందరూ స్వచ్చందంగా లాక్ డౌన్ కి సహకరించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.ఈ నేపధ్యంలో సెలబ్రిటీలు కూడా ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి కరోనాపై జరుగుతున్నా పోరాటంలో వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

తాజాగా కమెడియన్ అలీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో లక్ష విరాళంగా ప్రకటించాడు.

 Comedian Ali Suggest To People Donate For Corona Fight - Telugu Virus Covid-19 Tollywood

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ పైకి వెళ్లిపోవాలని కోరుతూ గత పదిరోజులుగా ఇంట్లోనే ఉంటూ నమాజ్‌ చేస్తున్నా.

చాలా మంది తిండి లేక, డబ్బుల్లేక బాధపడుతుంటారు.కానీ తప్పదు.ఈ వ్యాధి అలాంటిది.ప్రభుత్వాలకు, పోలీసులకు ప్రజలందరూ సహకరించాలి అని అన్నారు.

భారతదేశంలో చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు.ఈ సమయంలో వారు కూడా సాయం చేస్తే చాలా మంచిది.

కరోనాపై సరదాగా జోకులు వేసుకునే సమయం కాదు.రెట్లు పెంచేసి ఇష్టానుసారంగా డబ్బు సంపాదించే సమయం కూడా కాదు.

ప్రతి ఒక్కరు మానవత్వం చూపించాల్సిన సమయం.ముఖ్యంగా ఇండియాలో వ్యాపారులు, డబ్బున్న వారు ముందుకొచ్చి సహాయం చేస్తే ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఉండగలుగుతుంది అని చెప్పారు.

మరి అలీ సలహాని ఎంత మంది ప్రముఖులు పాటించి సాయం చేయడానికి ముందుకొస్తారు అనేది ఇప్పుడు చూడాలి.

తాజా వార్తలు

Comedian Ali Suggest To People Donate For Corona Fight Related Telugu News,Photos/Pics,Images..