నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన కమెడియన్ అలీ! ప్రొడక్షన్ లాంచ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అలీ.వందల సంఖ్యలో చిత్రాలలో నటించిన అలీ ఇప్పటికి స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

 Comedian Ali Started Production House-TeluguStop.com

టాలీవుడ్ చాలా మంది కమెడియన్స్ వచ్చి, ఫేడ్ అవుట్ అవుతున్న తనకి మాత్రం ఎలాంటి లోటు లేదు.వర్ధమాన కమెడియన్స్ కూడా అలీకి పోటీ ఇవ్వలేకపోతున్నారు.

స్టార్ హీరోల చిత్రాలలో దర్శకుడు ఇప్పటికి ఆలీ కోసం కచ్చితంగా పాత్రలు సృష్టిస్తూ ఉంటారు.చిన్న పెద్ద అని తేడా లేకుండా తన పాత్ర పరిధి మేరకు చేసుకుంటూ వెళ్తున్న అలీకి ఓ విధంగా అవకాశాలు కొదవలేదని చెప్పాలి.

బ్రహ్మానందంకి సినిమా అవకాశాలు తగ్గిన అలీకి మాత్రం ఫుల్ గా ఉన్నాయి.

ఇక నటనతో పాటు యాంకర్ గా కూడా దూసుకెళ్తున్న అలీ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశాడు.

ఈ మధ్యకాలంలో వెబ్ సిరిస్ లకి భాగా డిమాండ్ పెరిగింది.భవిష్యత్తు మొత్తం వెబ్ సిరిస్ ల యుగం నడుస్తుంది.ఈ నేపధ్యం తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వెబ్ సిరిస్ లు, రియాలిటీ షోలు నిర్మించడం జరుగుతుందని ఈ సందర్భంగా అలీ చెప్పుకొచ్చారు.ఇక ప్రొడక్షన్ హౌస్ ని క్రియేటివ్ గా తన పేరు కలిసి వచ్చేలా అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు.

దీనికి సంబందించిన లోగో రిలీజ్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ వంటి ప్రముఖులు హాజరయ్యారు.మరి అలీ ప్రొడక్షన్ హౌస్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి వెబ్ సిరిస్ లు వస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube