అందరూ బాగుండాలి అందులో నేనుండాలి రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఇక ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందింది.

 Comedian Ali Senior Naresh Pavitra Lokesh Andaru Bagundali Andulo Nenundali Movi-TeluguStop.com

ఇక ఈ సినిమాను అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, కొనతాల మోహనన్ కుమార్, శ్రీ చరణ్.ఆర్ రచన నిర్మాతలుగా చేశారు.

రాకేష్ పళిడమ్ సంగీతాన్ని అందించాడు.భాస్కరభట్ల రవికుమార్ పాటలు అందించాడు.

ఇక ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్, అలీ, మౌర్యాని తదితరులు నటించారు.ఇక ఈ సినిమా ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.పైగా మలయాళం నుండి ఈ సినిమా రీమేక్ నుండి తీసుకోగా ఈ సినిమా ఎంత రేటింగ్ సంపాదించుకుందో చూద్దాం.

కథ:

ఈ సినిమాలో నరేష్ శ్రీనివాసరావు అనే పాత్రలో, పవిత్ర లోకేష్ సునీత అనే పాత్రలో కనిపించారు.అయితే వీరిద్దరి భార్యాభర్తలు.వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.ఇక వీరు వయసు మీద పడుతున్న కూడా ఒకరి మీద ఒకరు బాగా ప్రేమ చూపించకుంటూ ఉంటారు.ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు.

అయితే ఎంతో సంతోషంగా ఉండే వీరి జీవితాలు.

మహమ్మద్ సమీర్ (అలీ) ఒక ఫోటో తీయడం వల్ల ఆ ఫోటో కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

Telugu Andarubagundali, Ali, Sripuram Kiran, Mouryani, Pavitra Lokesh, Senior Na

దుబాయ్ లో ఉండే సమీర్ కు బాగా సెల్ఫీల పిచ్చి ఉంటుంది.ఇక అతడు ఇండియాకి వచ్చాక కూడా అక్కడ కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటాడు.దీంతో ఆ సెల్ఫీల వల్లే తనకో సమస్య ఎదురవుతుంది.ఇంతకు ఆ సమస్య ఏంటి.ఇతడికి శ్రీనివాస్ దంపతులకు ఏంటి.చివరికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

అలీ తన నటనతో అదరగొట్టాడు.ఇక నరేష్, పవిత్ర లోకేష్ ల పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి.

వారి నటన కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమాను ఈ మధ్యకాలంలో జరిగే వాటిని దృష్టిలో పెట్టుకొని తీశాడు.ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

సంగీతం బాగా ఆకట్టుకుంది.

Telugu Andarubagundali, Ali, Sripuram Kiran, Mouryani, Pavitra Lokesh, Senior Na

విశ్లేషణ:

ఇక సినిమా మొత్తం నిజజీవితంలో జరుగుతున్న కథలా అనిపించింది.ఎమోషన్స్ సీన్స్ కూడా బాగా అద్భుతంగా చూపించాడు దర్శకుడు.ఇక కథకు కావాల్సిన సహజత్వం కూడా సినిమాలో కనిపించింది.

మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగా ఆసక్తిని పెంచాయి.నిజానికి సినిమా ఈ మధ్య జరుగుతున్న కాన్సెప్ట్ తో రూపొందింది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, ఎమోషన్స్ సీన్స్, సినిమా కథ, సంగీతం.

మైనస్ పాయింట్స్:

కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube