సినిమాలలో నటించకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన అలీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాల్లో నటించి కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ మధ్యకాలంలో అలీ వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు.

 Comedian Ali Reason For Not Acting In Movies Details, Ali, Tollywood, Movies, Telugu Film Industry, Comedian Ali , Ali Not Acting In Movies, F3 Movie, Director Anil Ravipudi, Sv Krishna Reddy, Yamaleela, Alitho Saradaga-TeluguStop.com

ఇక తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అలీ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా మే 27వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Comedian Ali Reason For Not Acting In Movies Details, Ali, Tollywood, Movies, Telugu Film Industry, Comedian Ali , Ali Not Acting In Movies, F3 Movie, Director Anil Ravipudi, Sv Krishna Reddy, Yamaleela, Alitho Saradaga-సినిమాలలో నటించకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన అలీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అలీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు అలీ సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను బుల్లితెరపై ఆలీతో సరదాగా కార్యక్రమాన్ని చేస్తున్నానని అలాగే యమలీల సీరియల్ చేశానని తెలిపారు.

ఎస్వీ కృష్ణారెడ్డి కోరిక మేరకే తను ఈ సీరియల్ నటించానని అలీ తెలిపారు.ఎందుకంటే సినిమా కోసం ఇండస్ట్రీలో ఎంతోమందిని ఒప్పించి ఎస్ వి కృష్ణారెడ్డి నన్ను హీరో చేశాడు.

అందుకే ఆయన ఏం చెప్పినా వెనకా ముందు ఆలోచించకుండా చేస్తానని వెల్లడించారు.

Telugu Ali, Alitho Saradaga, Anil Ravipudi, Telugu, Tollywood, Yamaleela-Movie

ఇక సినిమాలలో నటించకపోవడానికి కారణం తెలియజేస్తూ.ప్రస్తుత కాలంలో చిన్నచిన్న సినిమాలలో కూడా మాకు క్యారెక్టర్లు ఇస్తున్నారు.కథ ఏంటో చెప్పకుండా సినిమాలలో అవకాశం ఇస్తారు.

తీరా సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమాలలో అలీ ఎందుకు నటించారని ప్రేక్షకులు అనుకోకూడదు అందుకే సినిమాలు చేయడం మానేశానని అలీ తెలిపారు.ముందుగా కథ వివరించి నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని, ప్రాధాన్యత లేని పాత్రలు చేయనని ప్రస్తుతం ఆ అవసరం తనకు లేదని అలీ వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube