బీజేపీలో చేరనున్న పవన్ కళ్యాణ్ మిత్రుడు

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమిన గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నటుడు అలీ.ఇక అలీ కమెడియన్ గా ఎంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడో అదే స్థాయిలో ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అనే ముద్ర వేసుకున్నాడు.

 Comedian Ali Ready To Join Bjp-TeluguStop.com

పవన్ కళ్యాణ్ సినిమా ఆంటే అందులో కచ్చితంగా అలీ ఉండాల్సిందే.అంతలా వారి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యింది.

అయితే రాజకీయంగా వచ్చేసరికి ఇద్దరి దారులు మారిపోయాయి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన అలీ మాత్రం పవన్ వెంట నడవడానికి ఆసక్తి చూపించలేదు.

ఎన్నికల ముందు జగన్ ని కలవడంతో పాటు వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున స్టార్ క్యాపయినర్ గా కూడా ప్రచారం చేశాడు.ఎన్నికల తర్వాత జగన్ తనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాడని అలీ ఆశించాడు.అయితే ఆ విషయంలో జగన్ నుంచి అలీకి చుక్కెదురైంది అని చెప్పాలి.30 ఇయర్స్ పృధ్వీకి ఇచ్చిన ప్రాధాన్యత అలీకి జగన్ ఇవ్వలేదు.దీంతో ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీకి దూరంగా ఉన్న అలీ రీసెంట్ గా అతని తల్లి చనిపోయిన తర్వాత మరల పవన్ కళ్యాణ్ కి దగ్గరైనట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు అలీ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

దీనికి పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకుంటున్నారు.పవన్ బీజేపీతో పొట్టు పెట్టుకోవడం ద్వారా అలీని ఆ పార్టీలో చేరమని సలహా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా అలీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube