పవన్ తో ఆలీ భేటీ ! రెండు గంటల పాటు చర్చలు

గత కొద్ది రోజులుగా….సినీ కమెడియన్ అలీ ప్రస్తావన తరుచూ వార్తల్లోకి వస్తుంది.

 Comedian Ali Meat Janasena Chief Pavan Kalyan-TeluguStop.com

ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా అందరిని సస్పెన్స్ కి గురి చేస్తూ….అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ… అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

మొన్నామధ్య వైసీపీ అధినేతను కలవగా … ఆ తరువాత చంద్రబాబు నాయుడుని కలిసి చర్చలు జరిపారు.అలాగే నిన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ని కలిశారు.

ఆయన టీడీపీ తరపున గుంటూరు టికెట్ ఆశిస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

అయితే… ఈ రోజు తన మిత్రుడైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు.జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు.ఆలీని వెంటబెట్టుకుని అమరావతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.

వైసీపీలో ఈ నెల 9వ తేదీన ఆలీ చేరబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తన స్నేహితుడు, గురువు, మార్గదర్శకుడిగా పవన్‌ను చెప్పుకునే అలీ.ఆయన సలహాలు తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది.దాదాపు 2 గంటలపాటు పాటు వీరి భేటీ కొనసాగింది.

అయితే వారిద్దరూ ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube