హిందీలో సందడి చేయనున్న సాంబ! అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్!  

దబాంగ్ సీక్వెల్ లో సాంబ పాత్రలో కనిపిస్తున్న అలీ. .

Comedian Ali Key Role In Dabang 3 Movie-key Role In Dabang 3 Movie,prabhu Deva,salman Khan

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో కమెడియన్ అలీ చేసిన సాంబ క్యారెక్టర్ ఎంత భాగా వర్క్ అవుట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా హిందీలో వచ్చిన దబాంగ్ సినిమాకి సీక్వెల్ అన్న విషయం అందరికి తెలిసిందే. గబ్బర్ సింగ్ లో సాంబ క్యారెక్టర్, అలాగే అంత్యాక్షరి ఎపిసోడ్ సల్మాన్ ఖాన్ కి భాగా కనెక్ట్ అయ్యింది..

హిందీలో సందడి చేయనున్న సాంబ! అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్!-Comedian Ali Key Role In Dabang 3 Movie

దాంతో ఆ ఎపిసోడ్ తో పాటు, సాంబ పాత్రని దబాంగ్ సీక్వెల్ లో పెట్టాలని సల్మాన్ డిసైడ్ అయిపోయాడు. ప్రస్తుతం దబాంగ్ సిరిస్ లో మూడో సినిమాకి సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో కమెడియన్ అలీకి అవకాశం దక్కింది. ఇక దబాంగ్ సీక్వెల్ లో అలీ చేయబోయే పాత్ర సాంబ పాత్రకి రీమేక్ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. మొత్తానికి కెరియర్ లో మొదటి సారి అలీ హిందీ సినిమాలో అదిరిపోయే పాత్రతో ఎంట్రీ ఇవ్వడం విశేషం.