పవన్ కి ఝలక్ : వైసీపీలోకి ఆలీ .... ఇచ్ఛాపురం సభలో చేరిక ....?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు… పవన్ సినిమాల్లో తప్పనిసరిగా కనిపించే కమెడియన్ అలీ రాజకీయ అడుగులు గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.జనసేనలో ఆలీకి రాజమండ్రి టికెట్ ఖాయం అయ్యింది అంటూ … వార్తలు కూడా వినిపించాయి.

 Comedian Ali Joining In To Ycp-TeluguStop.com

అయితే ఈ విషయంలో పవన్ కానీ… ఆలీ కానీ ఎక్కడా స్పందించలేదు.

అయితే….ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏదో ఒక పార్టీలో చేరి టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ తో ఆలీ మంతనాలు కూడా జరిపారు.

దీంతో పవన్ ఫ్యాన్స్ ఆలీ మీద విరుచుపడ్డారు.కానీ కొంతమంది మాత్రం ఆయన జనసేనతోనే ఉంటారాని… వైసీపీలోకి వెళ్లరని ఖండించారు.

కానీ ఆలీ మాత్రం వైసీపీలో చేరేందుకు దాదాపు ఫిక్స్ అయిపోయారట.

జనవరి 9న ఇచ్చాపురంలో జగన్.ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది.ఆ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.

ఇచ్చాపురం సభ వేదికగా జగన్ సమక్షంలో ఆలీ వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.దివంగత సినీ నిర్మాత రామానాయుడు 1999లో బాపట్ల నుంచి టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీచేశారు.

ఆ సమయంలో టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్నారు అలీ.

రామానాయుడుకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఐతే పవన్ కల్యాణ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.ఆయన జనసేనలో చేరే అవకాశముందని ప్రచారం జరిగింది.కానీ ఆయన మాత్రం వైసీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.

ఆలీ కూడా వైసీపీలో చేరితే ఆ పార్టీకి మరింత సినీ గ్లామర్ మరింత పెరుగుతుంది.ఇప్పటికే….ప్రమఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీలు మరికొంతమంది సినీ వర్గానికి చెందిన వారు వైసీపీలో ఉన్నారు.అలాగే…ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి వైసీపీ జనసేన పార్టీలు ఒకరికొకకు సహకరించుకోవాల్సి వస్తే వారి మధ్య అలీ వారధిగా పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చని కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.

దీనికి పవన్‌తో అలీకి ఉన్న సానిహిత్యమే కారణం అంటూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక అలీ వైసీపీకి వస్తే ఆ పార్టీకి ముస్లిం మైనార్టీల బలం కూడా చేకూరుతుందని భావిస్తున్నారు.

ఇటు అభిమానుల అండ, అటు ముస్లిం సామాజిక వర్గం తోడైతే వైసీపీకి మరింత బలం చేకూరుతుందని లెక్కలు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube