కమెడియన్ అవ్వకముందు అలీ.. రోడ్డు మీద బట్టలు అమ్ముతూ ఉండేవాడట తెలుసా?

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు.ఈ వ్యాఖ్యం వినగానే అందరికీ గుర్తొచ్చేది అన్న నందమూరి తారక రామారావు గారే.

 Comedian Ali Early Life Details ,comedian Ali,  Film Carreer , Yamaleela, Sv Kri-TeluguStop.com

అయితే ఆనాడు నందమూరి తారకరామారావు చెప్పిన వ్యాఖ్యాన్ని ఎంతోమంది ఇప్పటి వరకు నిజం చేసి చూపించారు అనే చెప్పాలి.కృషి పట్టుదలతో సాధారణ స్థాయి నుంచి ఏకంగా సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు.

అలాంటి వారిలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ కూడా ఒకరు అని చెప్పాలి.సాధారణంగా సొంతంగా ఎదిగిన హీరోల గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కానీ సొంతంగా ఎదిగిన కమెడియన్స్ గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడతారూ.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం కమెడియన్ గానే మాత్రమే కాదు హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటాడు కమెడియన్ అలీ.ప్రస్తుతం అలీ గురించి చెప్పమంటే ఆయన చేసిన సినిమాల గురించి ఆయన డైలాగుల గురించి టకటకా చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.

కానీ ఆయన సినీ కెరీర్ మొదలు పెట్టే ముందుకు ఏం చేసాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అలీ చివరికి వృత్తిరీత్యా రోడ్డు పక్కన బట్టలూ అమ్ముతూ జీవించేవాడట.

Telugu Ali, Carreer, Mohan Mitra, Sholay, Sr Ntr, Yamaleela-Latest News - Telugu

ఈ క్రమంలోనే ఓ రోజు ఒక పెద్దాయన ఆలీ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఎలా అమ్ముతున్నావ్ అంటూ అడగడంతో అలీ ఏదో వెటకారంగా సమాధానమిచ్చాడట.దీంతో ఆయనకు కోపం వచ్చింది.ఇంతకీ అలా అడిగింది ఎవరు అనుకుంటున్నారు కదా అప్పుడు తెలుగు లో పెద్ద డైరెక్టర్ గా కొనసాగుతున్న మోహన్ మిత్రా గారు.ఇక అంతలోనే అక్కడికి వచ్చిన అలీ తండ్రి మా వాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఏంటి అంటూ మోహన్ మిత్రను అడిగారట.

అదేం లేదు కానీ పిల్లలతో ఈ పని ఎందుకు చేస్తున్నావ్ అని అడిగాడట ఆయన.

Telugu Ali, Carreer, Mohan Mitra, Sholay, Sr Ntr, Yamaleela-Latest News - Telugu

వీడికి చదువు అబ్బలేదు గురువుగారు అందుకే ఈ పని చేయిస్తున్న అంటూ సమాధానం చెప్పాడట.అంతలోనే మోహన్ మిత్ర ఏంట్రా అబ్బాయి నీకు ఏమి వచ్చు అని అడగడంతో.షోలే మూవీలోని డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పడంతో ఆశ్చర్య పోయారట.

కొంచెం మిమిక్రీ కూడా చేసి చూపించడం తో అతనిలో ఉన్న టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చాడు.ఆ తర్వాత యమలీల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.ఆ తర్వాత కమెడియన్ అలీ కెరియర్ గురించి అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube