సినిమాల్లోకి అలీ కూతురు ఎంట్రీ.. ఆ పాత్రలో..?

బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వందల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్ గా నటించి కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అలీ.గతంతో పోలిస్తే అలీకి మూవీ ఆఫర్లు తగ్గినా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అలీతో సరదాగా అనే కామెడీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Comedian Ali Daughter Zuveria Meethi Gets Tollywood Entry At 8 Years Age, Zuver-TeluguStop.com

అయితే అలీ కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.అలీ హీరోగా తెరకెక్కుతున్న లాయర్ విశ్వనాథం అనే సినిమాలో జువేరియా మీతి కూడా నటిస్తున్నారు.

అలీ 8 సంవత్సరాల వయస్సులోనే బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టగా జువేరియా 9 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టడం గమనార్హం.చాలామంది స్టార్ హీరోల కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటే ఈ స్టార్ కమెడియన్ కూతురు కూడా బాలనటిగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Telugu Ali, Viswanatham, Role, Tollywood, Zuveria Meethi-Movie

ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీలోకి తాను అడుగు పెట్టానని.తన కూతురు కూడా దాదాపు ఇదే వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని అలీ అన్నారు.జువేరియా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

జువేరియా మాట్లాడుతూ ఈ సినిమాలో ఛాన్స్ దక్కినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని.ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బాల నాగేశ్వ‌ర‌రావుకు థ్యాంక్స్ అని చెప్పారు.

తొలి సినిమాగా ఈ మూవీ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుందని జువేరియా అన్నారు.భవిష్యత్తులో జువేరియా మరిన్ని మంచి పాత్రలతో నటిగా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

వచ్చే వారం విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube