పవన్ కళ్యాణ్ స్నేహంపై ఆలీ కామెంట్.. చాల్లే పోవయ్యా అంటూ నెటిజెన్స్ ఫైర్!

వెండితెరపై ఎంతోమంది నటీనటులు మంచి స్నేహితులుగా పేరు పొందారు.ఈ విధంగా పేరుపొందిన ఎంతోమంది స్నేహితులలో అలీ, పవన్ కళ్యాణ్ స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Comedian Ali About Pawan Kalyan On Friendship Day-TeluguStop.com

వీరిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఏర్పడింది.పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అలీకి తెలుసు.

పవన్ కన్నా ముందు ఇండస్ట్రీలోకి వచ్చిన అలీ చిరంజీవి గారి కోసం వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ని కలిసేవారు.ఈ విధంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.

 Comedian Ali About Pawan Kalyan On Friendship Day-పవన్ కళ్యాణ్ స్నేహంపై ఆలీ కామెంట్.. చాల్లే పోవయ్యా అంటూ నెటిజెన్స్ ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటించిన కూడా అందులో తప్పకుండా అలీ కోసం ఒక పాత్ర క్రియేట్ చేయాల్సిందే.అలీ లేని సినిమాలో పవన్ కళ్యాణ్ నటించేవారు కాదు.అంతగా వీరిమధ్య స్నేహబంధం ఏర్పడింది.అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం, అలీ వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేయడంతో వీరి మధ్య కాస్త దూరం పెరిగిందని చెప్పవచ్చు.

Telugu Comedian Ali, Comedian Ali And Pawan Kalyan, Friendship Day, Pawan Kalyan-Movie

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అలీని ఉద్దేశించి పలు విమర్శలు కూడా చేశారు.స్నేహితులు కూడా వదిలి వెళ్లారు.వారికి జీవితమే ఇచ్చాను అంటూ పవన్ చెప్పగా అందుకు అలీ స్పందిస్తూ.నాకు ఎవరూ లైఫ్ ఇవ్వలేదు అతను సినిమాలలోకి రాక ముందే నేను ఇండస్ట్రీ లో ఉన్నాను అంటూ విమర్శలు చేశారు.

ఈ విధంగా రాజకీయాలు వీరిద్దరి మధ్య దూరం పెంచాయి.కేవలం రాజకీయ పరంగా మాత్రమే దూరంగా ఉన్నారు గాని వ్యక్తిగతంగా తాము ఎప్పుడూ మంచి స్నేహితులని ఆ తర్వాత పలు సందర్భాలలో కలిసినప్పుడు అలీ తెలియజేశారు.

ఇక తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అలీ పవన్ కళ్యాణ్ పలు సినిమాల్లో నటించినటువంటి ఫోటోని షేర్ చేస్తూ .నీలాంటి స్నేహితుడు ఎప్పుడు గుండెల్లో నే ఉంటాడు.నీతో ఉన్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.అలీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానులు అతనిపై అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావ్ నీ మాటలు ఎవరు నమ్మరు అంటూ కామెంట్ చేస్తున్నారు.

#Comedian Ali #Pawan Kalyan #Friendship Day #ComedianAli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు