జబర్దస్త్ కమెడియన్లకి నిజంగానే లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారా... ?  

comedian Adhire Abhi reacts about Contestants remuneration in jabardasth, jabardasth, Extra jabardasth, Adhire Abhi, Contestants remuneration, Point blank movie update, Tollywood, - Telugu Adhire Abhi, Comedian Adhire Abhi Reacts About Contestants Remuneration In Jabardasth, Contestants Remuneration, Extra Jabardasth, Jabardasth, Point Blank Movie Update, Tollywood

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయిన ఈ టీవీ లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  ఈ షో లలో కమెడియన్లు తమ స్కిట్ ల తో అదరగొడుతున్న యాంకర్లు రష్మి గౌతమ్ మరియు అనసూయ భరద్వాజ్ తమ అందచందాలతో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

TeluguStop.com - Comedian Adhire Abhi Reacts About Contestants Remuneration In Jabardasth

గత కొద్ది కాలంగా కొందరు నెటిజన్లు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో పని చేస్తున్నటువంటి టీం లీడర్లు మరియు కంటెస్టెంట్లకి పారితోషకం ఎంత ఇస్తున్నారనే విషయంపై తెగ చర్చించుకుంటున్నారు.

కాగా తాజాగా ఈ జబర్దస్త్ కామెడీ షో లో టీం లీడర్ గా పని చేస్తున్న “అదిరే అభి” ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో పని చేస్తున్నటువంటి కంటెస్టెంట్లకు ఇచ్చేటువంటి పారితోషికం విషయంపై స్పందించాడు.

TeluguStop.com - జబర్దస్త్ కమెడియన్లకి నిజంగానే లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారా… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో పని చేస్తున్న టీం లీడర్లు మరియు కంటెస్టెంట్లకి సంబంధించిన పారితోషకాన్ని మొత్తం టీం లీడర్ కి ఇస్తారని ఆ తర్వాత టీం లీడర్ తన టీంలో పని చేస్తున్నటువంటి కంటెస్టెంట్లకి సరిసమానంగా వాటాలు పంచుతడాని తెలిపాడు.

అయితే ఎంత ఇస్తున్నారనేది మాత్రం పక్కగా చెప్పలేదు కానీ యూట్యూబ్ వీడియోలలో చూపించినట్లు మూడు లక్షలు లేదా ఐదు లక్షలు ఇంత పెద్ద మొత్తంలో మాత్రం పారితోషకం ఉండదని స్పష్టం చేశాడు.ఒకవేళ లక్షల రూపాయల పారితోషికం ఇచ్చినట్లయితే చాలా మంది కమెడియన్లు ఈ పాటికి కోటీశ్వరులు అయ్యే వారిని కాబట్టి లక్షల రూపాయలు పారితోషికం ఇస్తున్నారనేది కేవలం అపోహ మాత్రమే అని తెలిపాడు.

అంతేకాక జబర్దస్త్ లో లేదా ఎక్స్ట్రా జబర్దస్త్ లో పని చేస్తున్నటువంటి అందరి కమెడియన్లు డబ్బు కోసం మాత్రమే పని చేయరని కొందరు ఫేమ్ కోసం కూడా పని చేస్తుంటారని, ఇలాంటి వారు పారితోషికం తీసుకోకుండా కూడా పని చేస్తారని చెప్పుకొచ్చాడు.అలాగే తాను స్కిట్ లో నటించడం పూర్తయిన వెంటనే తనకు పారితోషికానికి సంబంధించిన డబ్బులు చెక్కు రూపంలో ఇస్తారని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అదిరే అభి తెలుగులో “పాయింట్ బ్లాంక్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

కాగా ఈ చిత్రం యాక్షన్ మరియు థ్రిల్లర్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో అదిరే అభి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు.

ఇదివరకే బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరియు షకలక శంకర్ లు హీరో గా వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.దీంతో అదిరే అభి పాయింట్ బ్లాక్ చిత్రంతో ఎలా ఆకట్టుకోబోతున్నాడా…? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#PointBlank #Adhire Abhi #Jabardasth #ComedianAdhire

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు