ఎన్నారై కు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కొలంబియా కోర్టు  

Columbia Court Gave Mind Blowing Judgement To Nri-doctor Gobi Nadh,judgement To Nri Husband

ఒక విడాకుల కేసుకు సంబంధించి ఎన్నారై డాక్టర్ కు కొలంబియా కోర్టు దిమ్మతిరిగే తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే…గోబీనాధన్ దేవతాసన అనే ఎన్నారై డాక్టర్ 1997 లో ఇండోనేషియా లో పనిచేశాడు. అయితే ఆ సమయంలో తన సహోద్యోగిని ఆయిన్ నర్సు తో సంబంధం నెరిపాడు. అయితే అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న గోబీ నాథ్ ఆ తరువాత భార్యకు విడాకులు ఇచ్చి నర్సును పెళ్లి చేసుకున్నాడు..

ఎన్నారై కు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కొలంబియా కోర్టు -Columbia Court Gave Mind Blowing Judgement To NRI

అయితే వృత్తి రీత్యా అతడు రెండో పెళ్లి తరువాత కెనడా కి వెళ్లాల్సిరావడం తో భార్య తో కలిసి కెనడా చేరుకున్నారు. అక్కడ కొంతకాలం వారిరువురు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

అయితే కొంత కాలానికి అతడు తిరిగి ఇండోనేషియా వెళ్లాల్సి వచ్చింది. దీనితో కుటుంబాన్ని కెనడా లోనే వదిలేసి ఇండోనేషియా లో వెళ్ళిపోయాడు.

అయితే వీరి మధ్య మనస్పర్థలు కలగడం తో భార్య విడాకులు కావాలని కోర్టు ను ఆశ్రయించింది.

అయితే కోర్టు విచారణ సమయంలో అప్పటికే అతడికి చాలా ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన న్యాయమూర్తి వాటిని వెంటనే ఫ్రీజ్ చేయాలని,కేసు విచారణ పూర్తి అయ్యే వరకు అతడు ఆస్తులను వాడకూడదు అంటూ ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల పై గోబీ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తి పై మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రత్యర్థి లాయర్ తో కుమ్మక్కు అయ్యింది అంటూ అసభ్య పదజాలం తో రెచ్చిపోయాడు.

అయితే అలాంటి దుర్భాషలాడితే న్యాయమూర్తి ఊరుకుంటారా.

దీనితో కేసు విచారణ పూర్తి అయిన తరువాత గోబీ నాథ్ ప్రవర్తన అత్యంత నీచంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి రెండో భార్యకు రూ. 130 కోట్లు చెల్లించాల్సిందే అంటూ దిమ్మతిరిగే తీర్పు వెల్లడించారు. అంతేకాకుండా నెలవారీ ఖర్చుల కోసం ప్రతి నెల రూ. 50 లక్షలు చెల్లించాల్సిందే అని తెలిపింది. దీనితో చేసేదేమీ లేక గోబీ నాథ్ ఆ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కనీసం న్యాయమూర్తి పై దుర్భాషలాడక పోయి ఉండి ఉంటె గోబీ నాథ్ కు తీర్పు విషయంలో కొంచమైనా ఫేవర్ గా వచ్చి ఉండేదేమో పాపం.