బన్నీతో నటించడానికి నో చెప్పిన స్వాతి.? ఎందుకో తెలుసా.? కారణం ఏంటంటే.?  

Colours Swathi No For Allu Arjun Movie-

కలర్స్ స్వాతి మా టివిలో కలర్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా పరిచయం అయి.ప్రోగ్రాం పేరునే తన పక్కన చేర్చుకుని కలర్స్ స్వాతి అయింది...

బన్నీతో నటించడానికి నో చెప్పిన స్వాతి.? ఎందుకో తెలుసా.? కారణం ఏంటంటే.?-Colours Swathi No For Allu Arjun Movie

ఆ ప్రోగ్రామ్ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గానూ చేసింది,ఇప్పుడు అవకాశాలు తగ్గాయి కానీ ఒకప్పుడు స్వాతి మంచి సినిమాల్లోనే నటించి నటిగా గుర్తింపు పొందింది.అంతేకాదు డబ్బింగ్,సింగింగ్ లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.ఈ మధ్య స్వాతి ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

“జల్సా’ సినిమాలో ఇలియానా పాత్రకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు స్వాతినే.ఆ పాత్రకు డబ్బింగ్ కోసం 30 మందిని ట్రై చేయగా.ఆ సినిమా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి నచ్చలేదట. కొత్త వాయిస్ కావాలని చూస్తూ స్వాతితో డబ్బింగ్ చెప్పించారు…అదేవిధంగా 100%లవ్ సినిమాలో పాట కూడా పాడింది స్వాతి.అప్పుడు కూడా దేవిశ్రీప్రసాద్ పట్టుబట్టి స్వాతితో ఆ పాట పాడించారట.

కెరీర్ తొలి దశలోనే స్వాతికి అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ వచ్చిందట.అది కూడా అల్లు అర్జున్ మొదటి చిత్రం,కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో… కానీ అప్పటికి ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చి మెడిసిన్ ఫ్రీ సీట్ రావడంతో చదువు వైపే మొగ్గు చూపిందట స్వాతి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు..

ఒకవేళ ఆ సినిమా చేసుంటే స్వాతి కెరీర్ గ్రాఫ్ ఇంకెలా ఉండేదో కానీ.రీజనబుల్ రీజన్ తోనే స్వాతి ఆ సినిమాను కాదనుకోవడంతో పెద్దగా బాదపడ్డానికి లేదు.నటన పరంగా మంచి మార్కులే ఉన్నా అవకాశాలు ఎందుకు రావట్లేదో మరి….