అందరి ముందు వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి... అసలేం జరిగిందంటే?

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి కలర్స్ స్వాతి(Colours Swathi) పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Colours Swathi Getting Emotional About Naveen Chandra Comments Details, Naveen C-TeluguStop.com

తాజాగా ఈమె నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) తో కలిసి మంత్ ఆఫ్ మధు(Month Of Madhu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నటుడు నవీన్ చంద్ర స్వాతి (Swathi) గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడంతో ఈమె ఒకసారిగా ఎమోషనల్ అవుతూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.మరి స్వాతి గురించి నవీన్ చంద్ర ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే.

Telugu Colours Swathi, Madhu, Naveen Chandra, Naveenchandra, Swathi, Tollywood-M

ఈ సినిమాలో లేఖ అనే పాత్రలో నటించడానికి చాలా గడుసు ఉండాలి.మా చెల్లెలు జాబ్ చేస్తుంది తను ప్రతిరోజు బస్సు ఆటో లేదా మెట్రోలో ప్రయాణం చేయాల్సి వస్తుంది.ఇలా ఆమె తన కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడుతూ ధైర్యంగా ముందుకు వెళుతుంది.అలాగే స్వాతి కూడా ఎంతో కష్టపడుతుందని తాను కష్టపడటమే కాకుండా తనతో పనిచేసే వారిలో కూడా నమ్మకం కలిగిస్తుందని ఈయన స్వాతి గురించి మాట్లాడారు.

Telugu Colours Swathi, Madhu, Naveen Chandra, Naveenchandra, Swathi, Tollywood-M

ఇంతకంటే నేను ఆ దేవుడిని ఏమీ అడగలేను.తను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్ అంటూ కూడా ఈయన చెప్పుకొచ్చారు మా ఇద్దరి జోడి బాగుంటుందని నటన కూడా బాగుంటుందని మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలని కోరారు .అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నామంటూ నవీన్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడటంతో అక్కడే ఉన్నటువంటి స్వాతి ఒక్కసారిగా ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube