విడాకులకు సిద్ధమైన కలర్స్ స్వాతి... అలా హింట్ ఇచ్చేసిందిగా?

Colours Swathi Divorce Rumors Viral Social Media Details, Colours Swathi,Vikas,Samantha,Niharika Divorce, Colors Swathi Divorce, Colors Swathi Husband, Colors Swathi Vikas, Colors Swati Vikas Divorce

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి తరచు ఏదో ఒక వార్తలు రావడం సర్వసాధారణం.అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.

 Colours Swathi Divorce Rumors Viral Social Media Details, Colours Swathi,vikas,s-TeluguStop.com

ఇండస్ట్రీలో ఇప్పటికే విడాకుల పరంపర కొనసాగుతుంది.తాజాగా నిహారిక విడాకులు(Niharika Divorce) తీసుకున్న విషయం మర్చిపోకముందే మరొక జంట విడాకుల వార్త తెరపైకి వచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా కొనసాగుతూఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కలర్స్ స్వాతి (Colours Swathi) వికాస్ (Vikas) అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈమె తన భర్తకు దూరం కాబోతున్నారని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది.ఈ విధంగా కలర్స్ స్వాతి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటిని డిలీట్ చేశారు.ఇలా ఫోటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త వైరల్ గా మారింది.

గతంలో సమంత(Samantha) నాగచైతన్య(Nagachaitanya) నిహారిక (Niharika) వెంకట చైతన్య(Venkata Chaitanya) కూడా విడాకులకు ముందు ఇలా సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేసి అనంతరం విడాకుల విషయాన్ని ప్రకటించారు.

ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి సైతం తన భర్త వికాస్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్త సంచలనంగా మారింది.అయితే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు తన భర్తతో కలిసి థాయిలాండ్ లో ఉన్నటువంటి స్వాతి ప్రస్తుతం హైదరాబాద్ వచ్చేసి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు కానీ తన భర్త మాత్రం అక్కడే ఉన్నారు.ఇలా కలర్స్ స్వాతి తన భర్త వికాస్ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube