అబ్బాయిలను ఈ రంగులతో ఆకట్టుకోవచ్చు     2016-06-09   05:49:51  IST  Raghu V

అమ్మాయి అందాన్ని మరో ఎత్తుకి చేరుస్తాయి అందమైన బట్టలు. ఆకర్షణీయమైన బట్టల్లో అందమైన అమ్మాయి కనబడితే ఏ మగాడి గుండె కుదురుగా ఉంటుంది ? కాని ఒక్కో రంగుని బట్టి మగవాడి చూపు మారిపోతూ ఉంటుందట. అందుకే అమ్మాయిలు, తమ బాయ్ ఫ్రెండ్ ని ఏ రకంగా ఆకట్టుకోవాలంటే అలాంటి రంగు బట్టలు వేసుకోవాలి.

పింక్ – ఈ రంగు అంటే అమ్మాయిలకు బాగా ఇష్టం. ఈ రంగు బట్టలు వేసుకున్న అమ్మాయిలంటే అబ్బాయిలకి కూడా ఇష్టమే. ఈ రంగులో అమ్మాయిలు క్యుట్ గా కనిపిస్తారు. యువరాణి లాగా, వేరే లోకంలోంచి వచ్చిన అమ్మాయిలాగా ఫీల్ అయిపోతారట అబ్బాయిలు.

బ్లాక్ : బ్లాక్ లో అమ్మాయిలు స్టన్నింగ్ గా కనిపిస్తారు. ఫ్యాషన్, బోల్డ్, మోడ్రన్ గా కనిపిస్తారు. ఈకాలం లో అదేగా కావాల్సింది. కాబట్టి అబ్బాయిలను ఎంతగానో ఆకట్టుకుంటుంది బ్లాక్. ఓసారి ట్రై చేయండి నలుపు దుస్తులు.

రెడ్ : ఈ రంగు బట్టల్లో ఇష్టమైన అమ్మాయి కనబడితే ఆబ్బాయిల ఆలోచనలు ఎక్కడికో వెళతాయి. అత్యంత సెక్సి కలర్ రెడ్. కామాన్ని ప్రేరేపిస్తుండ్. డిజైరబుల్ గా, హాట్ గా కనిపిస్తారు.