నిఖిల్ సినిమాలో కలర్స్ పాప.. కానీ!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నాడు.దర్శకుడు చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేశారు.

 Colors Swathi In Karthikeya 2-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో నిఖిల్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశంపై చాలా రోజులుగా ఆసక్తి నెలకొనగా, ఇటీవల చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.

 Colors Swathi In Karthikeya 2-నిఖిల్ సినిమాలో కలర్స్ పాప.. కానీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్తికేయ చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించగా, నిఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ సూపర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఆ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ అందించారు.

అయితే ప్రస్తుతం కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.దీంతో కార్తికేయ 2 సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమాలో కలర్స్ స్వాతి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న స్వాతి, కార్తికేయ 2 చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కార్తికేయ’ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ సీక్వెల్ చిత్రంలో కూడా కనిపిస్తారు.అందుకే స్వాతి కూడా ఈ సీక్వెల్ చిత్రంలో కనిపించబోతుందని, అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి కార్తికేయ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను అలానే మెయిన్‌టెయిన్ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఇలా అమ్మడిని మరోసారి కార్తికేయ 2 చిత్రంలో తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు పాపులర్ నటీనటులు నటిస్తు్న్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి కార్తికేయ 2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Colors Swathi #Karthikeya #Swathi Reddy #Nikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు