మీ తీరేంటి ఆ రంగులేంటి ? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరవాత ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా లో ఉన్నరంగులను కార్యాలయాలకు వేస్తున్నారు.దీనిపై ప్రతిపక్షాల పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా రంగులు మార్చే కార్యక్రమంలో నిమగ్నం అయ్యింది.

 Colors Of Government Office In Andhra Pradesh-TeluguStop.com

అయితే ఈ వ్యవహారం హైకోర్టు కు చేరడంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఏమిటంటూ కోర్టు నిలదీసింది.

అసలు ఏ ప్రాతిపదికన రంగులు వేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసిపి జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయ స్థానం ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించింది.ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించింది.

ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube