కొలరాడోపై విరుచుకుపడిన మంచు తుఫాను: స్తంభించిన జనజీవనం

గంటల తరబడి మంచు తుఫాను విరుచుకుపడటంతో కొలరాడోలో సాధారణ జనజీవనం స్తంభించింది.పెద్దసైజులో మంచు గడ్డలు పడుతుండటతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లిమోన్ వెళ్లే 70వ నెంబర్ రహదారిని అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే.

 Colorado Snowstorm Moresnow Record Cold Winter Storm Warning In Effect-TeluguStop.com

ఈ తుఫానుకు బెస్సీగా అధికారులు నామకరణం చేశారు.దీని కారణంగా డెన్వర్‌లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

Telugu Colorado, Snowstorm, Telugu Nri Ups, Storm Effect-

మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో పలు ప్రాంతాలో వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.ఈ క్రమంలో పశ్చిమ డెన్వర్ ప్రాంతంలోని ఐసెన్ హోవర్ టన్నెల్ మార్గాన్ని అధికారులు మూసివేశారు.అయితే కొలరాడోలోని కొన్ని ప్రాంతాల్లో తరగతులు జరిగినట్లుగా సమాచారం.కాని డెన్వర్ మరియు కొలరాడో స్ప్రింగ్స్‌లోని పలు జిల్లాల్లో భారీ హిమపాతం వస్తుందని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించడంతో పలు విద్యాసంస్ధలు విద్యార్ధులను ఇంటికి పంపివేశాయి.

Telugu Colorado, Snowstorm, Telugu Nri Ups, Storm Effect-

అలాగే కొలరాడో రవాణా శాఖ సైతం ప్రజలు తమ పనులను త్వరగా ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచించింది.ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకే మూసివేశారు.డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 900 విమాన సర్వీసులను రద్దు చేయడమో లేదంటే దారి మళ్లీంచడమో చేశారు.ఎయిర్‌పోర్టు ఆవరణలో 6 సెంమీ మేర మంచు నిండిపోయింది.

కాగా మంగళవారం వాయువ్య కొలరాడోలోని క్రెయిగ్ ప్రాంతంలో మైనస్ 2 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది.ఈ క్రమంలో తుఫాను కాస్త తెరిపినివ్వడంతో బుధవారం డెన్వర్‌కు తూర్పు ప్రాంతంలో ఉన్న 70వ నెంబర్ అంతర్రాష్ట్ర రహదారిని అధికారులు పునరుద్ధరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube