దేవుడా: ప్రియురాలు పంపిన ఆహ్వానం నచ్చకపోవడంతో ఏకంగా 6 మందిని..?!

లవర్ బర్త్ డే రక్తపాతమైంది.బంధువులు శవాలయ్యారు.ఇందుకు కారణం ప్రేమికుడి ఆగ్రహమే.బర్త్‌డే వేడుకుల‍్లో పాల్గొనాని ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కోరింది.అయితే ఆమె ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపేశాడు.ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు.అమెరికా కొలరాడో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల కథనం మేరకు.మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరగాల్సి ఉంది.

 Colorado Mass Shooting Man Fires And Killed 6 Getting Angry With Lovers Invitation-TeluguStop.com

ఆ బర్త్‌డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్‌ను రావాలంటూ ప్రియురాలు కోరింది.అయితే తన లవర్ అందించిన ఆహ్వానంపై ఆ యువకుడు ఫైర్ అయ్యాడు.

వెంటనే మాకియాస్‌ బాధితురాలి బంధువులపై కాల్పులకు జరిపాడు.ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30), పెరెజ్(33), జోనా క్రజ్(52), జోస్ గుటిరెజ్(21), జోస్ ఇబ్రారా(26) మృతి చెందారు.

 Colorado Mass Shooting Man Fires And Killed 6 Getting Angry With Lovers Invitation-దేవుడా: ప్రియురాలు పంపిన ఆహ్వానం నచ్చకపోవడంతో ఏకంగా 6 మందిని..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదంపై కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప‍్రియుడు మాకియాస్‌లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు.

అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తడం వల్ల ఇద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు తనను రమ్మని కోరిందని, అయితే తాను ఆమె మాటలకు కోపంతో ఊగిపోయాడని తెలిపారు.

ఆ కోపంలోనే ఆ యువకుడు బంధువులపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.నిందితుడు మాకియాస్‌ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15రౌండ్ల మ్యాగజైన్‌ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

#Invitation #Sandra #Killing #Birthday Party #Gun Firing

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు