ఈసారి తానే దర్శకత్వం చేస్తానంటున్న బర్నింగ్‌స్టార్‌ గురువు  

Sai Rajesh going to direct a film soon, Sai Rajesh, Suhaas, Color Photo Movie, Kobbari matta, Sampoornesh Babu, Steven Shankar - Telugu Chandini Chowdary, Color Photo, Color Photo Movie, Kobbari Matta, Sai Rajesh, Sampoornesh Babu, Steven Shankar, Suhaas, Telugu Film News

తెలుగు సినిమాకు సంపూర్నేష్‌ బాబు వంటి విభిన్నమైన నటుడిని పరిచయం చేసింది సాయి రాజేష్‌.సంపూర్నేష్‌ బాబును హృదయకాలేయం సినిమాతో సాయి రాజేష్‌ హీరోగా తీసుకు వచ్చాడు.ఆ సినిమాకు సాయి రేజేష్‌ నిర్మాతగా వ్యవహరించాడు.దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ అంటూ టైటిల్‌ కార్డ్‌ వేశారు.అయితే స్టీవెన్‌ శంకర్‌ మరెవ్వరో కాదు సాయి రాజేష్‌ అంటూ ఆ తర్వాత వెళ్లడి అయ్యింది.ఇక సంపూర్నేష్‌ బాబుతో రెండవ సినిమా కొబ్బరి మట్టను నిర్మించింది కూడా సాయి రాజేష్‌ అనే విషయం అందరికి తెల్సిందే.

TeluguStop.com - Color Photo Sai Rajesh To Direct Movie

ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కొబ్బరి మట్ట సినిమాకు కథను మరియు స్క్రీన్‌ప్లేను అందించింది సాయి రాజేష్‌.

అయితే నిర్మాతగా మాత్రమే పేరు వేసుకున్నాడు.ఆ సినిమా దర్శకత్వ బాధ్యతను మరొకరికి అప్పగించాడు.

TeluguStop.com - ఈసారి తానే దర్శకత్వం చేస్తానంటున్న బర్నింగ్‌స్టార్‌ గురువు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవల తాను రాసుకున్న కథ కలర్‌ ఫొటోను కూడా వేరే దర్శకుడి చేతిలో పెట్టాడు.కేవలం తాను నిర్మాతగా మాత్రమే ఉన్నాడు.

దర్శకుడిగా కూడా మంచి ప్రతిభ కనబర్చగల సాయి రాజేష్‌ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నించలేదు.కలర్‌ ఫొటోకు వస్తున్న కామెంట్స్‌ మరియు ప్రశంసల కారణంగా తన తదుపరి సినిమాకు తానే దర్శకత్వం వహించాలని భావిస్తున్నాడట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.సంపూర్నేష్‌ బాబును హీరోగా చేసిన ఘనత సుహాస్‌ తో హీరోగా నటింపజేసిన ఘనత కేవలం సాయి రాజేష్‌ మాత్రమే దక్కింది.

ఇతను పలువురు నటీనటులను పరిచయం చేశాడు.అయితే తెర వెనుకే ఉన్నాడు.

ఎట్టకేలకు ఈసారి దర్శకత్వం చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.ప్రస్తుతం కథ రెడీ అవుతుందని త్వరలోనే సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

తన గత సినిమాలు ఇచ్చిన బూస్ట్‌ తో ఒక యంగ్‌ స్టార్‌ ను డైరెక్ట్‌ చేయబోతున్న సాయి రాజేష్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతాడో చూడాలి.

#Steven Shankar #Sai Rajesh #Suhaas #Kobbari Matta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Color Photo Sai Rajesh To Direct Movie Related Telugu News,Photos/Pics,Images..