దసరాకి ఆహాలో రానున్న కలర్ ఫోటో  

Color Photo Movie Telecast in in Aha in Dasara, Tollywood, Actress Sunil, chandini chowdary, suhas, Color Photo Movie - Telugu Actress Sunil, Chandini Chowdary, Color Photo Movie, Color Photo Movie Telecast In In Aha In Dasara, Suhas, Tollywood

సక్సెస్ ఫుల్ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సునీల్.అయితే ఈ సారి కెరియర్ లో మొదటి సారి పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ లో సునీల్ సందడి చేయబోతున్నాడు.

 Color Photo Movie Telecast In In Aha In Dasara

ఇప్పటికే డిస్కో రాజా సినిమాలో క్లైమాక్స్ లో తన విలనిజంతో మెప్పించిన సునీల్ ఈ సారి కలర్ ఫోటో అనే మూవీ కోసం పూర్తి స్థాయిలో విలనిజం పండించబోతున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ భాగా ఆకట్టుకుంది.

ఇక అవకాశం దొరికితే పెర్ఫార్మెన్స్ తో సునీల్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికాడని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇందులో యంగ్ కమెడియన్ గా పలు సినిమాలలో నటించిన సుహాస్ హీరోగా నటించాడు.

దసరాకి ఆహాలో రానున్న కలర్ ఫోటో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ కలర్ ఫోటో సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది.

ఒక నల్లబ్బాయికి, తెల్లమ్మాయికి మధ్య ప్రేమ ఎలా పుట్టింది.వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే ఎలిమెంట్ తో సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.హృదయకాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు తెరకెక్కించిన సాయి రాజేష్ ఈ సినిమాకి నిర్మాత.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇప్పటికే ఒటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

అక్టోబర్‌ 23న విజయదశమి సందర్బంగా విడుదల చేయటానికి ముహుర్తం ఖరారు చేశారు.దర్శకుడు సందీప్‌ రాజ్‌ మాట్లాడుతూ,’ఈ లాక్‌డౌన్‌లో ప్రేక్షకులకు బాగా దగ్గరై అందరితో ఆహా అనిపించుకున్న ఆహా ఓటిటి ద్వారా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంటికొచ్చి ఇస్తాం మీ మెబైల్స్‌, టీవీ, లాప్‌టాప్‌లు మా కోసం ఆన్‌ చేయండి చాలు.ఇంటికి వచ్చి నవ్వించడం మాకు కొత్త కాదు అని చెప్పుకొచ్చాడు.

మరి సునీల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా అతనికి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#ColorPhoto #Suhas #Actress Sunil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Color Photo Movie Telecast In In Aha In Dasara Related Telugu News,Photos/Pics,Images..