కలర్ ఫోటో టీం కూడా ఆహా అనేసింది... డిసెంబర్ లో రిలీజ్

ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి.లో బడ్జెట్ తో కొత్త క్యాస్టింగ్ తో తెరకెక్కే ఈ సినిమాలు కథా వైవిధ్యం కారణంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతున్నాయి.

 Color Photo Movie Plan To Release In Aha Ott, Tollywood, Suhash, Actress Sunil,-TeluguStop.com

మంచి సినిమాకి ఎప్పుడు కూడా ప్రజాదారణ ఉంటుందని ఇలాంటి చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో చిన్న సినిమా కలర్ ఫోటో.

ఈ సినిమా ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా నటిస్తున్నాడు.వైజాగ్ అమ్మాయి చాందినీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు.దీంతో ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా విడుదల అయిన కలర్ ఫోటో మూవీ టీజర్ కూడా భాగా ఆకట్టుకుంది.
సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హృదయకాలేయం దర్శక నిర్మాత సాయిరాజేష్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు కథ కూడా అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు ప్రేమ కథలో కులాలు, మతాలని ముడిపెట్టి చూపిస్తే ఈ సినిమాలో బాడీ కలర్ కి లింక్ పెట్టి చూపించబోతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మంచి రేటుకు అల్లు వారి ఓటీటీ ఆహా దక్కించుకున్నట్లు సమాచారం.

దీపావళి కానుకగా నవంబరు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట.లో బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ సినిమాని నిర్మాత కొంత ప్రాఫిట్ కి అమ్మేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube