తెలుగు సినిమాలలో బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమైన నటి రాశి.ఈమె అందం, నటన ఎంతో ఆకట్టుగా ఉంటుంది.
ఎన్నో సినిమాల్లో నటించిన రాశి అప్పట్లో సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది.చూడడానికి ఎంతో అందంగా ఉన్న రాశి.ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
1982లో సినీ పరిశ్రమకు పరిచయమైన రాశి.ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా తాను నటించిన ప్రేయసి రావే, గోకులంలో సీత, శుభాకాంక్షలు, చెప్పాలని ఉంది వంటి సినిమాలలో తన నటన ఇప్పటికీ గుర్తు చేస్తుంది.
తమిళంలో కూడా నటించిన రాశి.తెలుగులో కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.రాశికి ఓ లవ్ స్టోరీ కూడా ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు.ఎందుకంటే అంత అందగత్తె కి ఎక్కువ లవ్ ప్రపోజల్ వచ్చే ఉంటాయి.

రాశి ని ఎంతోమంది వ్యాపారస్తులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారట.కానీ ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అతను ఎవరో కాదు.అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ముని.ఎంతోమంది వ్యాపారస్తుల ను కాదని కేవలం ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుందంటే ఆమె మనస్సు గొప్పదే అని అర్థమవుతుంది.ఆమె నటించిన సినిమాలలో సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయనతో పరిచయం పెరిగి స్నేహితులుగా మారారట.
ఈ విషయం గురించి తాజాగా రాశి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తన తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు అని తెలిపింది.
దీంతో ఆమె శ్రీముని తో మరింత దగ్గరయింది.ఆ సమయంలోనే రాశి తనతో నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగగానే వెంటనే శ్రీముని ఓకే చెప్పాడట.
దీంతో ఇరువైపులా కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నానని రాశి చెప్పుకొచ్చింది.