హార్ట్ అయిన కలర్ ఫోటో హీరోయిన్.. ఎందుకో తెలుసా?  

color photo heroine chandini chowdary hurted for not recognizing her Chandini Chowdari, Colour Photo, Social Media, Madhuram, Raj Tarun, Ketugadu, Kundanapu Bomma, Howra Bridge, Nani, Jagapathi Babu - Telugu Chandini Chowdari, Chandini Chowdary Hurted For Not Recognizing Her, Colour Photo, Howra Bridge, Jagapathi Babu, Ketugadu, Kundanapu Bomma, Madhuram, Raj Tarun, Social Media

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం అన్నీ ఉన్నా అదృష్టం ఉంటే మాత్రమే హీరోయిన్ గా పేరు, గుర్తింపు దక్కుతుంది.అలా అందం, అభినయం అన్నీ ఉన్నా హీరోయిన్ గా కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది చాందిని చౌదరి.

TeluguStop.com - Color Photo Heroine Chandini Chowdary Hurted For Not Recognizing Her

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన చాందిని చౌదరి ఆ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు, గుర్తింపు వచ్చింది.దీంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

తెలుగమ్మాయి అయిన చాందిని చౌదరి యువ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు జోడీగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.మధురం, నౌ దో గ్యారహ్ షార్ట్ ఫిలిమ్స్ చాందినికి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

TeluguStop.com - హార్ట్ అయిన కలర్ ఫోటో హీరోయిన్.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన చాందిని చౌదరికి నటించిన తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.ఆ తరువాత కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను సినిమాల్లో నటించింది.

అయితే ఆ సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈ తెలుగమ్మాయిని పెద్దగా పట్టించుకోలేదు.అయితే కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది.

కొన్ని రోజుల క్రితం ఆహా ఓటీటీలో విడుదలైన కలర్ ఫోటో సినిమాకు హిట్ టాక్ వచ్చింది.నాని, జగపతిబాబు ఈ సినిమాను ప్రశంసించడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతూ హీరోను, సినిమా యూనిట్ ను ప్రశంసిస్తున్నారు.

అయితే సినిమాలోని పాత్రలో అద్భుతంగా నటించినా చాందిని పేరును ప్రస్తావించడం లేదు.నటుడు జగపతిబాబు సైతం చాందిని పేరును ప్రస్తావించడం మరిచిపోయాడు.దీంతో చాందిని సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేస్తూ పేర్లు ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయమని, సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకేనని ఆమె పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్ల ద్వారా చాందిని బాగానే హర్ట్ అయిందని తెలుస్తోంది.

#Madhuram #Social Media #Kundanapu Bomma #Jagapathi Babu #Raj Tarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Color Photo Heroine Chandini Chowdary Hurted For Not Recognizing Her Related Telugu News,Photos/Pics,Images..