కలర్ ఫోటో పూజా కార్యక్రమాలతో ప్రారంభం

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో.ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు.

 Color Photo Formally Launched-TeluguStop.com

మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు.

స్క్రిప్ ను సునీల్ అందించిన ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.

Telugu Pavansadineni, Color, Colorformally, Gopi Mohan, Swaroopsounded, Venkates

యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube