మీ మూత్రంరంగుని బట్టి మీ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవచ్చు...  

Color Of Your Pee Says About Your Health-

మూత్రం రంగుని బట్టి మీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకోవచ్చు.అవును ఇది అక్షరాల నిజం.మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మిళితమే మూత్రం..

Color Of Your Pee Says About Your Health--Color Of Your Pee Says About Health-

శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి.ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి.అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు.

క్రింద తెలిపిన మూత్ర రంగును బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో,వాటికి పరిష్కారాలేంటో చూడండి:

స్పష్టమైన మూత్రం:

ఇటువంటి మూత్రం కలిగిన వారు అతిమూత్ర వ్యాధి కలిగిన వారు.ఈ మధుమేహం ఉన్న వారు తరచూ మూత్రం వెళ్ళడం నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది..

దీని కారణంగా దాహం ఎక్కువగా వేస్తుంది మరియు నిద్రాసమయంలో నిద్రలేస్తూ ఉంటారు.సరిగ్గా నిద్ర ఉండదు.

ముదురు పసుపు మూత్రం:

మూత్రవిసర్జన రంగు పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే అలాంటి వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి.శరీరానికి సరిపడా నీరు తీసుకోవట్లేదు అనేదానికి సూచనే ముదురు పసుపు రంగు మూత్రం..

నియాన్ పసుపు రంగు:

ఇలాంటి మూత్రరంగు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.విటమిన్ బి, విటమిన్ సి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇది ఎక్కువకాలం ఉండదు.అలా మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు ఈ ఆహారపదార్ధాలు తీసుకోవడం వలన అది తగ్గిపోతుంది..

ఆరంజ్ రంగు మూత్రం:

నిర్జలీకరణ లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వలన ఈ రంగు వస్తుంది.ఇది తిత్తి లేదా కనతి కామెర్లకు దారితీస్తుంది..

నీలం రంగు:

మూత్రం నీలిరంగులో ఉంటే భయపడాల్సిన పనిలేదు..

మీరు తీసుకునే ఆహారం మరియు కొన్ని రకాల మందులను తీసుకోవడం వలన మూత్రం నీలిరంగులో ఉంటుంది.

ఎరుపు రంగు మూత్రం:

మీరు తీసుకునే సహజమైన ఆహారమే మీ మూత్రం ఎరుపురంగులో ఉండడానికి కారణం.మరికొన్నిసార్లు మూత్రం ఎరుపురంగుఉండి మరియు వేడిగాఉన్నట్లయితే పిత్తాశయంలో రాళ్లు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించాలి..

ఆకుపచ్చ మూత్రం:

సూడోమొనాస్ ఎరుగినోస్ అనే బ్యాక్టీరియా వలన మూత్రం ఆకుపచ్చరంగులో ఉంటుంది..

పార్కిన్సన్స్ వ్యాధి మరియు విచార వ్యతిరేక ఔషధాలను కూడా ఈ రంగు యొక్క కారణం కావచ్చు.