కాలేజీ ఫెస్ట్ కోసం ఆ ఇద్దరు డాన్స్ రిహార్సల్ చేస్తూ లేట్ అయ్యింది.! తర్వాత ఆ అబ్బాయి ఏం చేసాడో తెలుసా.?       2018-06-16   03:42:21  IST  Raghu V

అర్థ‌రాత్రి ఎవ‌రైనా యువ‌తి లేదా మ‌హిళ ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు, మృగాళ్లు రెచ్చిపోతున్న రోజులివి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఎంద‌రో దుండగుల చేతుల్లో మ‌హిళ‌లు లైంగిక దాడుల‌కు, అత్యాచారాల‌కు గుర‌వుతున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయినా వాటి గురించి స‌రిగ్గా ఆలోచించే వారు లేరు, ప‌ట్టించుకునే వారు లేర‌నే చెప్ప‌వ‌చ్చు. స్త్రీల‌ను అలాంటి దృష్టితో చూసే వారిలో మార్పు వ‌స్తే త‌ప్ప వారిపై జ‌రుగుతున్న దుశ్చ‌ర్య‌లకు అడ్డుక‌ట్ట ప‌డేందుకు అవ‌కాశం లేద‌నేది నిర్వివాదాంశం. అయితే అలాంటి మార్పు రావాలంటే ఈ యువ‌కుడిలా అంద‌రూ ఉండాలి. అప్పుడే ఎంత రాత్రి అయినా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంది.

చిత్రంలో ఉన్న యువ‌కున్ని, యువ‌తిని చూశారా..? వారిద్ద‌రిదీ ఒకే కాలేజ్‌. ముంబైలో చ‌దువుకుంటున్నారు. కాక‌పోతే ఆ యువ‌కుడు ఆమె క‌న్నా సీనియ‌ర్‌. అయితే ఇటీవ‌ల ఒక రోజు కాలేజీలో ఓ ఫెస్టివ‌ల్ కోసం డ్యాన్స్ రిహార్స‌ల్స్ జ‌రిగాయి. అందులో ఆ యువ‌తి పాల్గొంది. ఈ క్ర‌మంలో ఆ రోజు బాగా రాత్రి అయిపోయింది. ఇంటికెళ్లేందుకు క్యాబ్‌ను పిల‌వాల‌నుకుని బ‌య‌టికి వ‌చ్చింది. అయితే ఆ యువ‌కుడు ఆమెను వారించి త‌న కారులో దింపుతాన‌ని చెప్పాడు. దీంతో ఆమె మొద‌ట సందేహించినా, త‌రువాత ఒప్పుకుంది. అనంత‌రం వారిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయారు. ఆ యువ‌తిని అంత రాత్రి పూట క్యాబ్‌లో ఒంట‌రిగా పంప‌డం ఇష్టం లేక‌, అదంత సేఫ్ కాద‌ని భావించే ఆమెను త‌న కారులో దింపాన‌ని ఆ యువ‌కుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అనుభ‌వాన్ని పంచుకున్నాడు.

ఇప్పుడ‌ర్థ‌మైందా. పైన చెప్పిన లాంటి యువ‌కులు ఎందుకు కావాలో..! అంద‌రూ అలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది క‌దా. అప్పుడు దేశంలో మ‌హిళ‌ల‌పై ఎలాంటి లైంగిక దాడులు జ‌ర‌గ‌వు. అర్థ‌రాత్రి కూడా మ‌హిళ‌లు త‌లెత్తుకుని నిర్భ‌యంగా ఎటైనా సాగిపోవ‌చ్చు. కానీ ఆ యువ‌కుడిలా అందరూ ఉండాలంటే అది సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే ఒంట‌రిగా ఎవరైనా యువ‌తి క‌నిపిస్తే అడ్వాంటేజ్ తీసుకునే యువ‌కులే చాలా మంది ఉన్నారు. ఇక వారు మంచిగా ఉంటార‌ని అనుకోవ‌డం ఎడారిలో నీరు దొరుకుతుంద‌ని వెళ్లిన‌ట్టే అవుతుంది. అంతే క‌దా..!