చెన్నై లో అత్యుత్సాహం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న కాలేజీ విద్యార్థులు

ఈ తరం యువత అత్యుత్సాహాలను ప్రదర్శిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలా నే చోటుచేసుకున్నాయి.చెన్నై లోని బస్ డే వేడుకల్లో యువత అత్యుత్సాహం ప్రదర్శించడం తో అపశృతి చోటు చేసుకుంది.

 College Students Fall Of Bus Roof In Chenai Goes Viral In Social Media-TeluguStop.com

బస్‌ డే వేడుకల్లో భాగంగా 30 మంది కాలేజీ విద్యార్థులు బస్ టాప్‌పై ఎక్కి కూర్చుని బస్ వెళ్తుంటే కేరింతలతో హోరెత్తించారు.అయితే ఇంతలో అనుకోకుండా బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం తో విద్యార్థులు అంతా కూడా ఒక్కసారిగా కింద పడిపోయారు.

ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.దీనితో ఆ ఒక్క విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

వీరంతా చెన్నైలోని పచ్చయప్పా కాలేజీకి చెందిన విద్యార్థులు.బస్సు ముందు వెళ్తున్న ఓ విద్యార్థుల బైక్‌పై అడ్డుగా ఉండడంతోనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

మరోపక్క ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

చెన్నై లో అత్యుత్సాహం తో ప్రా

ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అయితే ఈ దృశ్యాలను అన్నిటిని కూడా ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.బస్సు డే వేడుకల పేరుతో బస్సుల పైకి ఎక్కి వీరంగం చేయడం మానుకోవాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు.

అయితే పోకిరీ విద్యార్థులు మాత్రం వారి సూచనలను ఖాతరు చేయడం లేదు.దీంతో అవసరమైతే కఠిన చర్యలకైనా వెనుకాడబోవద్దని పోలీసులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube