షార్ట్ వేసుకుందని పరీక్షహాల్లోకి రానివ్వని అధికారులు.. ఆ విద్యార్థిని ఏం చేసిందో తెలిస్తే..!!

ఎగ్జామ్ అయినా సరే విద్యార్థులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.సరైన సమయానికి, హాల్ టికెట్ తో వస్తేనే పరీక్ష హాల్ లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు.

 College Management Not Allowed The Girl To Write Exam For Wearing Short In Assam-TeluguStop.com

ఆలస్యంగా వచ్చి గేట్ బయటే ఆగిపోయిన విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం.కానీ ఒక స్టూడెంట్ మాత్రం పరీక్ష కేంద్రానికి కరెక్ట్ టైమ్ కు వచ్చినా.

అక్కడి అధికారాలు లోపలికి రానివ్వలేదు.షార్ట్స్ వేసుకున్నందున ఎగ్జామ్ రాయనివ్వమని కరాకండీగా తేల్చి చెప్పారు.

దాంతో ఒక్కసారిగా ఆ విద్యార్థిని షాక్ తింది.దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుంచి ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకుంది.

మళ్లీ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేసరికి పరీక్ష కూడా అయిపోతుంది.దాంతో ఆ విద్యార్థిని అక్కడి అధికారులను పరీక్ష హాల్లోకి అనుమతించాల్సిందిగా వేడుకొంది.

కానీ ఇన్విజిలేటర్ ఒప్పుకోలేదు.చివరికి విద్యార్థిని ఏం చేసిందో తెలుసుకుంటే…

అస్సాంలోని సోనిట్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో గిరిజానంద చౌదరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఉంది.

బుధవారం అనగా సెప్టెంబర్ 15న ఈ కాలేజీలో అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఏయూ) జరిగింది.ఈ పరీక్ష రాసేందుకు 19 ఏళ్ల జూబ్లీ అనే విద్యార్థిని 70 కి.మీ దూరంలో ఉన్న బిశ్వనాథ్ చరియాలీ నుంచి వచ్చింది.ఐతే ఈ బాలిక పరీక్ష రాయడానికి షార్ట్స్ తో వచ్చింది.

ఎగ్జామ్ కేంద్రంలో ఎలాంటి డ్రెస్సింగ్ కోడ్ అవసరం లేదనే ఒకే ఒక కారణంతో ఆమె పొట్టి బట్టలు ధైర్యంగా వేసుకొని వచ్చింది.కానీ కాలేజీ అధికారులు మాత్రం ఆమె డ్రెస్ ను తప్పుబట్టారు.

దాంతో ఆ అమ్మాయి ఖంగుతింది.ఈ విషయాన్ని తండ్రితో చెప్పడంతో ఆయన హుటాహుటిన ఒక ప్యాంటు కొనుగోలు చేయడానికి వెళ్లారు.

తండ్రి వచ్చేసరికి ఆలస్యమైపోతుందని.పరీక్ష రాయనివ్వాలని అమ్మాయి అధికారులను ప్రశ్నించింది.

దాంతో అక్కడే ఉన్న దర్వాజా కర్టెన్ కాళ్లకు చుట్టుకోవాలని.అలా అయితేనే ఎగ్జామ్ హాల్లోకి రానిస్తామని వారు చెప్పారు.

దీంతో చేసేది లేక ఆ అమ్మాయి తన కాళ్లకు పరదా చుట్టుకొని ఎగ్జామ్ రాసింది.

Telugu Assam, Curtain, Exam, Allowed, Sonipat, Jubilee, Latest, Short, Wrapped,

తానేదో పెద్ద తప్పు చేసినట్లు అధికారులు తనని బయట నిల్చోపెట్టి.చివరికి పరదా కట్టుకునేలా చేశారని అమ్మాయి వాపోతోంది.“డ్రెస్ కోడ్ నిబంధలు గురించి తమకు చెప్పలేదని.అడ్మిట్ కార్డ్‌లోనూ నిబంధనలు లేవని అధికారులతో చెప్పాను.కానీ దీని గురించి ప్రత్యేకించి చెప్పాలా అది నువ్వే తెలుసుకోవాలని ఎగ్జామ్ నిర్వాహకులు నాపై మండిపడ్డారు.గతంలో కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఎగ్జామ్స్ రాశాను కానీ ఎవరూ కూడా అభ్యంతరం తెలపలేదు.కానీ ఈ కాలేజీ నిర్వాహకుల వల్ల నా జీవితంలో అత్యంత అవమానకరమైన అనుభవం చవిచూడాల్సి వచ్చింది.

అమ్మాయిలు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు కాలేజీ నిర్వాహకులకు ఉంటుందా? పొట్టి బట్టలు వేసుకుంటే నేరం చేసినట్లా?” అని పరీక్ష రాసి బయటికి వచ్చిన తర్వాత జూబ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube