కాలేజీ అడ్మిషన్లపై నాట్స్ అవగాహాన సదస్సు

ఏప్రిల్ 25: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సయమంలో అమెరికాలో కాలేజీల్లో అడ్మిషన్లపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు విద్యార్ధుల భవిష్యత్ ప్రణాళికపై కూడా స్పష్టత కరవైంది.

 College Admissions Held By Nats Tampa Chapter At Your Earliest Convenience Nats-TeluguStop.com

ఈ తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కాలేజీ అడ్మిషన్లపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు పూర్తి అవగాహాన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది.

అమెరికాలోని యూనివర్సీటీ కన్సల్‌టెంట్స్ ఆఫ్ అమెరికా సీ.ఈ.ఓ.రాబర్ట్ లీవిన్‌తో ఏర్పాటు చేసిన ఈ వెబినార్‌కు మంచి స్పందన లభించింది.దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ వెబినార్‌లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కాలేజీల్లో ప్రవేశాల గురించి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.కోవిడ్-19 ప్రభావం విద్యాసంస్థలపై ఎలా ఉంటుంది.? విద్యార్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై రాబర్ట్ అవగాహన కల్పించారు.ఎలాంటి కాలేజీలు ఎంచుకోవాలి.? ప్రభుత్వ, ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు మధ్య తేడాలేమిటి…? కాలేజీలు విద్యార్ధులను చేర్చుకునేముందు ప్రధానంగా ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.? కాలేజీ ఇంటర్వ్యూలను ఎలా విజయవంతం చేసుకోవాలనే అంశాలపై రాబర్ట్ చక్కగా ఈ వెబినార్లో వివరించారు.యూనివర్సీటీకి ర్యాంకింగ్ ఎలా వస్తుంది.? మనం దరఖాస్తు పెట్టుకునే క్రమంలోనే మనం ఈ ర్యాంకింగ్‌ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి.? అనే అంశాలను రాబర్ట్ లీవిన్ తెలిపారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు అడిగిన దాదాపు 75 ప్రశ్నలకు రాబర్ట్ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.వందల మంది జూమ్ ద్వారా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైర్టకర్ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు.వెబినార్ లో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు సమాధానాలందించటం లో ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

రాబోయే వారాంతాలలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన జరుగనుకున్నట్టు ప్రశాంత్ పిన్నమనేని తెలియచేశారు. ఈ వెబినార్ లో జూమ్ ఆప్ ద్వారా 440 మందికి పైగా మరియు పేస్ బుక్ ద్వారా కూడా ఎందరో పాల్గొన్నారని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలియచేశారు.

నాట్స్ టెంపాబే టీం ఏర్పాటు చేసిన ఈ వెబినార్ నిర్వహాణలో నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపా బే చాప్టర్ అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, టెంపాబే కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు , టెంపా బే సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ క్రియాశీల సభ్యులు ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ వెబినార్ నిర్వహాణ కీలకపాత్ర పోషించారు.

ఈ వెబినార్ నిర్వహణకు సహకారం అందించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీ కృష్ణ మేడిచర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube