లంచం తీసుకున్న అధికారి.. రూపాయి లేకుండా కక్కించిన కలెక్టర్  

Collector Sharath Makes Farmer To Get Back Bribe Amount-collector,collector Sharath,crime News,farmer,sharath

రైతులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే.అయితే ఓ రైతు వద్ద లంచం తీసుకున్న అధికారి చేత తిరిగి ఆ లంచం డబ్బులు కక్కించాడు ఓ కలెక్టర్.

Collector Sharath Makes Farmer To Get Back Bribe Amount-collector,collector Sharath,crime News,farmer,sharath Telugu Viral News Collector Sharath Makes Farmer To Get Back Bribe Amount-collector Collec-Collector Sharath Makes Farmer To Get Back Bribe Amount-Collector Collector Crime News Farmer

ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త తెలుగు రాష్ట్రాలలో హల్‌చల్ చేస్తోంది.

జగిత్యాల జిల్లాలో ఓ రైతు తన భూమి పట్టా కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు.సదరు రైతు భూమి పట్టా కావాలంటే రూ.10వేల లంచం కావాలని డిమాండ్ చేశాడు రమేష్ రెడ్డి అనే వీఆర్వో.

దీంతో ఆ రైతు అతడికి పదివేల నగదును ముట్టజెప్పాడు.అయినా అతడి పని మాత్రం జరగలేదు.దీంతో ఆ రైతు ప్రజావాణిలో కలెక్టర్ శరత్‌కు ఈ తతంగం మొత్తం వివరించాడు.

విచారణ జరిపిన కలెక్టర్ శరత్, రమేష్ రెడ్డి లంచం తీసుకున్నాడని నిర్ధారించి అతడిపై సస్పెన్షన్ వేటు వేశాడు.

అంతేగాక అతడు రైతు వద్ద తీసుకున్న లంచం రూ.10వేలు కూడా తిరిగి రైతుకు ఇప్పించాడు.

ఆ రైతుకు భూమిని వెంటనే పట్టా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

Collector Sharath Makes Farmer To Get Back Bribe Amount-collector,collector Sharath,crime News,farmer,sharath Related....