సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు...కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వారానికి రెండు రోజులు డ్రై డే పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వివిధ శాఖల అధికారులతో సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా:సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు ప్రణాళిక చేయాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, ప్రతి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా మంగళ, శుక్రవారాల్లో డ్రై డే గా పాటించాలని సూచించారు.

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో దోమల నివారణకు మందులు స్ప్రే చేయాలని, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రార్థన సమయంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు, నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించాలని, వారు తమ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేలా చూడాలని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత ఏడాది సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రబలాయో ఆయా చోట్ల ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, రక్తం, ప్లేట్లెట్ నిల్వలు ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

Advertisement

అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, డీఈఓ రమేష్ కుమార్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ఇంట్రా ఈఈ జానకి, మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ కుమార్, మైనారిటీ కార్యాలయ ఓఎస్డీ సర్వర్ మియా, తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు
Advertisement

Latest Rajanna Sircilla News