మరుగు దొడ్లు లేవ్...జీతాలు కట్!!

జిల్లా కలెక్టర్ ఒకరు స్కూల్ లో టాయిలెట్స్ సరిగ్గా లేవు అని టీచార్స్ పై కలెక్టర్ ఫయిర్ అయిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే… జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ భార్గవ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించారు.

 Collector Fires On Teachers-TeluguStop.com

సర్వ శిక్ష అభియాన్ పథకం కింద సదరు పాఠశాలకు నిధులున్నా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాని విషయాన్ని గూర్తించారు.దీంతో నిధులు ఇచ్చినా ఎందుకు మరుగుదొడ్లు నిర్మించలేదని టీచర్లపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలు పాటించరా అంటూ, టీచర్ల నిర్లక్ష్యమే కారణమని తెలుసుకుని వెంటనే పాఠశాలకు చెందిన 25 మంది టీచర్ల వేతనాలను నిలిపివేయాలని సంబంధింతి అధికారులకు అదేశాలు జారీ చేశారు.తన కార్యాలయం నుంచి తదుపరి ఆదేశాలు జారీ అయ్యేదాకా వారి వేతనాలు విడుదల చేయరాదని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో షాడోల్ జిల్లాలోని షోహాగ్పూర్ బ్లాక్‌లో 10 మంది, గోపారు బ్లాక్‌లో నలుగురు, బుదార్లో ముగ్గురు, బెవ్హరి ఇద్దరు, జైసింగ్నగర్ ఆరుగురి ఉపాధ్యాయుల వేతనాలు ఆపేశారు.ఇదే విధానం మన రాష్ట్రంలోను వస్తే బావుండేదేమో కనీసం మన వారు కూడా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా ఆలోచనలు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube