మళ్ళీ విలన్ గా మారుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  

కోలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు. .

Collection King Mohan Babu Re-entry With Villain Role In Kollywood-hero Surya,re-entry With Villain Role In Kollywood,sudha Kongar,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అంటే మోహన్ బాబు అని చెప్పాలి. విలన్ గా టాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా మారి తనకంటూ స్టార్ ఇమేజ్ ని మోహన్ బాబు సొంతం చేసుకున్నాడు. తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా డైలాగ్స్ చెప్పగల నటుడు మోహన్ బాబు ఒక్కడే అనే గుర్తింపుని కూడా సొంతం చేసుకున్నాడు..

మళ్ళీ విలన్ గా మారుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు-Collection King Mohan Babu Re-entry With Villain Role In Kollywood

తాను ఎ పాత్ర చేసిన అందులో పరకాయ ప్రవేశం చేసి తన విలక్షణమైన నటనతో పాత్రకి ప్రాణం పోసే అతి కొద్ది మంది నటులలో మోహన్ బాబు కూడా ఒకడు.ఇదిలా ఉంటే ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన మోహన్ బాబు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే యమదొంగ తర్వాత ఆ స్థాయిలో తన నట విశ్వరూపం చూపించే సినిమా మరల ఇప్పటి వరకు రాలేదు.

కొన్ని సినిమాలు చేసిన వాటిలో చాలా వరకు ఫ్లాప్ కావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు తన సత్తా చూపించలేకపోయాడు. అయితే చాలా కాలం తర్వాత మరల మోహన్ బాబు విలన్ గా రీ ఎంట్రీ ఇస్తూ అదిరిపోయే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. గురు సినిమాతో దర్శకురాలిగా సత్తా చాటిన సుధ కొంగర ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా తెరకెక్కిస్తుంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకురాలి ఏరికోరి మోహన్ బాబుని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండటం వలన దానికి మోహన్ బాబు అయితే సరిపోతాడని భావించి అతనిని ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మోహన్ బాబు రీసెంట్ గా సంతకం చేసాడని సమాచారం.

మరి విలన్ గా రీఎంట్రీలో మోహన్ బాబు తన నట విశ్వరూపం ఎ రేంజ్ లో చూపిస్తాడు అనేది వేచి చూడాలి.