భక్త వత్సలం నాయుడుగా కలెక్షన్ కింగ్...

తెలుగులో హీరో, విలన్, కమెడియన్ ఇలా అన్ని రకాల జోనర్ లకు సంబంధించిన పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేటువంటి సీనియర్ హీరో మోహన్ బాబు ఈసారి మరో కొత్త అవతారం ఎత్తనున్ననాడు.తాజాగా మోహన్ బాబు తమిళ్ హీరో సూర్య నటించినటువంటి “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 Collection King Mohan Babu Play Bhaktavatsalam Naidu Role-TeluguStop.com

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కీలక అప్డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ఇందులో సీనియర్ హీరో మోహన్ బాబు భక్తవత్సలం నాయుడు అనే ఎయిర్పోర్ట్ వింగ్ కమాండర్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.అంతేకాక ఈ పాత్ర కు సంబంధించినటువంటి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

అయితే ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే సినిమాల్లోకి రాక ముందు మోహన్ బాబు తన ఒరిజినల్ పేరు కూడా భక్తవత్సలం నాయుడు కావడం విశేషం.అయితే ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కించారు.

Telugu Mohan Babu, Mohanbabu, Tollywoodmohan-Movie

అయితే ఈ చిత్రానికి సంబందించినటువంటి పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం.అంతేకాక దర్శకురాలు సుధా కొంగర కూడా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9వ  తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube