కోమటి రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ఇక ముగింపు లేనట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్నా అంతర్గత కలహాలతో ప్రజల్లోకి అంతగా బలంగా వెళ్ళలేకపోతోంది.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయినప్పటి నుండి కాంగ్రెస్ సీనియర్ నేతలకు రేవంత్ కు మధ్య కోల్డ్ వార్ అనేది కొనసాగుతూ వస్తోన్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

 Cold War Between Komati Reddy And Revanth Reddy , Komati Reddy Venaktreddy, Reva-TeluguStop.com

అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే గడువు ఉండటంతో రానున్న రోజులు కాంగ్రెస్ కు చాలా కీలకం అని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం కోమటి రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే పరిస్థితే లేదని తాను కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటానని, రేవంత్ రెడ్డి మరికొన్ని నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో కలకలం రేగిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కలిసి పనిచేస్తే తప్ప టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు.అయితే కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ అనేది ఇక తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలన్న అవశ్యకతను గుర్తించి హైకమాండ్ జోక్యం చేసుకుంటే కాని కాంగ్రెస్ లోని సమస్యలకు చెక్ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.మరి రేవంత్ రెడ్డి మాత్రం మరల సీనియర్ నేతల వైఖరిపై స్పందించకున్నా అంతర్గతంగా తనకు అనుకూలంగా ఉన్న నేతలతో తన కార్యాచరణను వ్యూహాలను అమలుచేస్తోన్న పరిస్థితి ఉంది.

మరి రోజురోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వాస్తవాన్ని గమనించి కాంగ్రెస్ సీనియర్ నేతలందరు కలిసి పనిచేస్తారా లేక చెరోదారి అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube