చిన్నప్పటి నుండి డబ్బు పొదుపు చేసి...13 ఏళ్ల అబ్బాయి దివాళి రోజు ఏం చేసాడంటే.? దెబ్బకి అందరు నోరెళ్లబెట్టారు!  

  • ధ‌నిక వ‌ర్గాల‌కు చెందిన వారికి టూవీల‌ర్ కొన‌డం అంటే మంచి నీళ్లు తాగినంత ప‌ని. వారు అనుకుంటే వెంట‌నే నెట్ క్యాష్ పే చేసి త‌మ‌కు కావాల‌నుకున్న వ‌స్తువును కొంటారు. కానీ పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్రజ‌లు మాత్రం అలా కాదు. పైసా పైసా కూడ‌బెట్టుకుని ఆ మొత్తంతో త‌మ‌కు కావ‌ల్సిన వ‌స్తువుల‌ను కొంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ ఇద్ద‌రు పిల్లలు కూడా స‌రిగ్గా ఇదే చేశారు. వారు త‌మకు త‌ల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మ‌నీని వృథాగా ఖ‌ర్చు పెట్ట‌లేదు. పోగు చేసుకున్నారు. అలా కొన్నేళ్ల పాటు కూడ‌బెట్టిన డ‌బ్బుతో ఆ ఇద్ద‌రిలోని బాలుడు త‌న సోద‌రికి స్కూటీ కొనిచ్చాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది జైపూర్‌లో.

  • Coins For 62 Thousand Rupees- Brother Buys Scooter Sister-Brother\'s Love Coins Rupees Sister

    Coins For 62 Thousand Rupees- Brother Buys Scooter For Sister

  • జైపూర్‌లో నివాసం ఉండే యాష్ కు ఇప్పుడు 13 ఏళ్లు. అయితే అత‌ను చిన్న‌ప్ప‌టి నుంచి త‌న త‌ల్లిదండ్రులు పాకెట్ మ‌నీకి ఇచ్చిన డ‌బ్బును పొదుపు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అన‌వ‌స‌ర ఖ‌ర్చు పెట్ట‌లేదు. ఈ క్ర‌మంలో అత‌ని సోద‌రి కూడా కొంత డ‌బ్బును పొదుపు చేసింది. కాగా యాష్ తాజాగా దీపావ‌ళి రోజున అక్క‌డే ఉన్న హోండా షోరూంకు వెళ్లి బైక్ కొంటాన‌ని చెప్పాడు. అందుకు షోరూం వారు షాక్ అయినా త‌రువాత తేరుకుని డ‌బ్బు ఏద‌ని అడిగారు. దీంతో యాష్ తాను పొదుపు చేసిన డ‌బ్బు మొత్తాన్ని కాయిన్ల రూపంలో రెండు బ్యాగుల్లో షోరూం వారికి అంద‌జేశారు. దీంతో వారు మ‌ళ్లీ షాక్ అయ్యారు.

  • Coins For 62 Thousand Rupees- Brother Buys Scooter Sister-Brother\'s Love Coins Rupees Sister
  • అయితే షోరూం వారు షాక్ అయిన‌ప్ప‌టికీ ఆ కాయిన్ల‌ను మొత్తాన్ని కౌంట్ చేశారు. అందుకు వారికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఆ మొత్తం కాస్తా రూ.62వేలుగా తేలింది. దీంతో షోరూం వారు యాష్‌కు హోండా యాక్టివాను అంద‌జేశారు. దాన్ని యాష్ త‌న సోద‌రికి బ‌హుమ‌తిగా ఇచ్చాడు. అయితే అన్ని కాయిన్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి ? అని షోరూం సిబ్బంది యాష్‌ను అడ‌గ్గా, తాను చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు ఇచ్చిన పాకెట్ మ‌నీని ఖ‌ర్చు పెట్ట‌కుండా పొదుపు చేసుకున్నాన‌ని, అందుకే ఆ మొత్తం రూ.62వేలు అయిందని, దాంతో త‌న సోద‌రికి స్కూటీ కొనివ్వాల‌నుకున్నాన‌ని, అది ఇప్పుడు తీరింద‌ని యాష్ చెప్పాడు. అవును మ‌రి, ఏది ఏమైనా వారిద్ద‌రి అనుబంధానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాగా యాష్ అలా కాయిన్లు కూడ‌బెట్టి స్కూటీ కొన‌డం ఏమో గానీ ఈ విష‌యం కాస్తా సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది!