అరుదైన ఏలియన్ బొమ్మ ఉన్న నాణెం.. ఎవరి వద్ద ఉందంటే..

చాలా మందికి అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది.అయితే వాటిని ప్రదర్శన పెట్టినప్పుడు చాలా మంది చూడడానికి వెళ్తుంటారు.

 Coin With A Rare Alien Toy  Who Owns It  , Aliyan Coin , Rare Record , Viral Lat-TeluguStop.com

వివిధ దేశాలలో ఉండే కరెన్సీని చూసి ఆశ్చర్యపోతుంటారు.అయితే తాజాగా అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఓ వ్యక్తి కనిపెట్టిన ప్రత్యేకమైన నాణెం ఇంటర్నెట్‌లో కలకలం రేపింది.

నాణెంపై ఏలియన్ తల ఉండడమే దానికి ప్రత్యేకత.దీంతో నెటిజన్లు ఆ నాణెం గురించి ఆసక్తిగా తెలుసుకోసాగారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నాణెం బొమ్మను మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫారం రెడ్డిట్‌లో కనిపించింది.

అక్కడ నుండి అది ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.ఈ నాణెంను జోర్డాన్ అనే వ్యక్తి గుర్తించాడు.

తాను పెద్ద సంచులను తనిఖీ చేస్తుండగా ఈ నాణెం దొరికిందని పేర్కొన్నాడు.తనకు దొరికిన నాణేన్ని పరిశీలించగా, దానిపై ఏలియన్ ముద్ర ఉండడంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు.“కాయిన్ రోల్స్ తనిఖీ చేయడం నా హాబీలలో ఒకటి.ఇది నేను నా ఖాళీ సమయంలో చేస్తుంటాను.

ఈ క్రమంలో ఓ వింత నాణెం చూసి వెంటనే షాక్ అయ్యాను.ఇది ఇతర నాణేలపై ఉండే వాషింగ్టన్ ప్రతిమలా లేదు.

దానికి పూర్తి విరుద్ధంగా ఉంది” అని పేర్కొన్నాడు.ఈ నాణేన్ని చూసిన నెటిజన్లు ఆ నాణెం గురించి ఆసక్తికరంగా ఆరా తీయసాగారు.

ఈ ‘హోబో నికెల్స్’ డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది.ఆ నాణెంను ఒక వైపే జోర్డాన్ చూపించాడు.

మరో వైపు ఏముందని చాలా క్యూరియాసిటీతో అడగసాగారు.దీనికి జోర్డాన్ స్పందిస్తూ, నాణెం వెనుక భాగంలో “గేదె అస్థిపంజరం” ఉందని వెల్లడించాడు.

ఈ హోబో నికెల్స్ అమెరికాలో 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రసిద్ధి చెందాయి.ఆ సమయంలో నిరాశ్రయులైన వ్యక్తులు కత్తులు, ఇతర సాధనాలను ఉపయోగించి వారి స్వంత డిజైన్లను చెక్కడం ద్వారా చిన్న విలువలతో కూడిన నాణేలను మార్చుకునే వారు.1913 నుండి 1980 వరకు దాదాపు 2 లక్షల క్లాసిక్ హోబో నికెల్‌లు సృష్టించబడ్డాయని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube